బ్లాక్ బెర్రీ దీవి క్యాంప్‌ఫైర్‌ను పరిశీలించిన మంత్రి సీతక్క
అటవీ ప్రాంతంలోని బ్లాక్ బెర్రీ దీవిని పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఈ మేరకు సోమవారం రాత్రి బ్లాక్ బెర్రీ దీవిని మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ దివాకర్ టీఎస్‌తో కలిసి సందర్శించారు.
పర్యాటకుల కోసం ఏర్పాటు చేస్తున్న గుడారాలు, క్యాంప్‌ఫైర్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ చిత్రమిశ్రా, డీఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవీందర్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment