సోమవారం శ్రీ 13 శ్రీ జనవరి శ్రీ 2025
మొదలైన సంక్రాంతి పండుగ సందడి
● వాకిళ్లలో ముగ్గులు.. ఆకాశంలో పతంగులు
● పిండి వంటల ఘుమఘుమలు ● నేడు భోగి
భోగి మంటలు.. రంగవల్లులు.. గొబ్బెమ్మలు.. బొడబొడికెలు.. పిండి వంటలు.. పతంగులు.. ఆడపడుచుల నోములు.. ఇచ్చిపుచ్చుకునే వాయినాలు.. గంగిరెద్దులు.. హరిదాసుల కీర్తనలు.. మొత్తంగా సంక్రాంతి అంటే సరికొత్త కాంతి. మూడు రోజుల ముచ్చటైన ఉత్సవం. పంట ఇంటికొచ్చేవేళ రైతు జరుపుకునే మొదటి పండుగకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. ఎక్కడ చూసినా.. పండుగ వాతావరణం కనిపిస్తోంది. – హన్మకొండ కల్చరల్
జీవితంలో కొత్తదనాన్ని స్వాగతిస్తూ.. పాత వస్తువుల్ని మంటల్లో వేయడంతో భోగి పండుగ ప్రారంభమవుతుంది. మూడు రోజుల వేడుకలో ఇది మొదటిది. ఉదయం చిన్న పిల్లలకు రేగు పళ్లతో స్నానం చేయించి కొత్త దుస్తులు వేసి పీటలపై కూర్చోబెడతారు. తల్లులు, అమ్మమ్మలు, నానమ్మలు, ఇరుగుపొరుగు ముత్తయిదువులు వారికి బొడబొడికెలు పోస్తారు. ఇలా చేస్తే దిష్టి పోతుందని, ఆయుఃవృద్ధి కలుగుతుందని నమ్మకం. హారతి పడతారు. ఆలయాల్లో గోదారంగనాథుల కల్యాణం నిర్వహిస్తారు.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment