సంక్రాంతి శుభాకాంక్షలు
వరంగల్: భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకు ని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదా య శాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద వేర్వేరు ప్రకటనల్లో ప్రజ లకు శుభాకాంక్షలు తెలి పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలతో అన్ని వర్గాల ప్రజల్లో సంతోషం వెల్లివిరుస్తున్నదని పేర్కొన్న మంత్రి సురేఖ.. రాష్ట్రం భోగభాగ్యాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అలాగే.. జిల్లా ప్రజలు సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోవాలని కలెక్టర్ సత్య శారద పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
కొత్తకొండ జాతరకు
ప్రత్యేక బస్సులు
హన్మకొండ: కొత్తకొండ వీరభద్ర స్వామి జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ వంగల మోహన్‌రావు తెలిపారు. ఆదివారం కొత్తకొండ జాతర తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటును పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈనెల 13 నుంచి 16 వరకు జాతర ప్రత్యేక బస్సులు హనుమకొండ జిల్లా బస్ స్టేషన్ నుంచి బయల్దేరి.. హసన్‌పర్తి, ములుకనూరు మీదుగా కొత్తకొండకు చేరుకుంటాయని పేర్కొన్నారు. చార్జీలు పెద్దలకు రూ.60, పిల్లలకు రూ.30గా నిర్ణయించినట్లు వివరించారు.
అంతర్జాతీయ ఖోఖో
పోటీలకు రెఫరీగా రమేశ్
వరంగల్ స్పోర్ట్స్: న్యూ ఢిల్లీలో మొదటిసారిగా నిర్వహించనున్న అంతర్జాతీయ ఖోఖో చాంపియన్‌షిప్ పోటీల రెఫరీగా హనుమకొండ డీఎస్‌ఏ కోచ్ రాజారపు రమేశ్ ఎంపికయ్యారు. ఈ మేరకు ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్ష, కార్యదర్శులు సుధాన్షు మిట్టల్, ఎంఎస్ త్యాగి ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆదివారం సంయుక్త ప్రకటనలో తెలిపారు. 23 దేశాల నుంచి 39 జట్లు పాల్గొంటున్న ఈ పోటీలకు రెఫరీగా రమేశ్‌కు అవకాశం దక్కడంపై డీవైఎస్‌ఓ గుగులోత్ అశోక్‌కుమార్ హర్శం వ్యక్తం చేశారు. తన ఎంపికకు సహకరించిన తెలంగాణ ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, నాతి కృష్ణమూర్తి, కసుమ సదానందం, వంగపల్లి సూర్యప్రకాశ్, ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి తోట శ్యామ్‌కు రమేశ్ ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment