విద్యతోనే సమాజంలో గుర్తింపు
ఖిలా వరంగల్: విద్యతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి అన్నారు. బుధవారం వరంగల్ ఉర్సు గుట్ట నానిగార్డెన్‌లో వడుప్సా(ట్రస్మా) రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ జనరల్ సెక్రటరీ నడిపెల్లి వెంకటేశ్వర్‌రావు, ట్రస్మా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఆడెపు శ్యామ్, జోన్ అధ్యక్షుడు ముక్కెర రవీందర్ అధ్యక్షతన పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థులకు ఓరియోంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా త్రిదండి చినజీయర్ స్వామి హాజరైజ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే ఆధ్యాత్మిక భావం అలవర్చుకోవాలన్నారు. మానసిక ఒత్తిడికి లోనుకాకుండా విషయ పరిజ్ఞా నం తెలుసుకోవాలన్నారు. క్రమశిక్షణ పట్టుదలతో చదివితేనే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని తెలిపారు. ప్రతి విద్యార్థి సన్మార్గంలో పయనిస్తూ తల్లిదండ్రులు, గురువులను దైవంగా భావించాలన్నారు. అనంతరం ట్రస్మా రాష్ట్ర అఽధ్యక్షుడు శివరాత్రి యాదగిరి మాట్లాడారు. విద్యార్థులు పరీక్ష సమయం వృథా చేయొద్దన్నారు. శ్రద్ధతో చదివి 10/10 గ్రేడ్ సాధించాలన్నారు. కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర ప్రతినిధులు కోడెం శ్రీధర్, అంకతి వీరస్వామి, బిల్లా రవి, జ్ఞానేశ్వర్‌సింగ్, సతీశ్, చక్రపాణి, మడిపెల్లి రాజు, కూచన క్రాంతికుమార్, దాసి సతీశ్‌మూర్తి, కిరణ్, ప్రవీణ్, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
త్రిదండి చినజీయర్ స్వామి
Comments
Please login to add a commentAdd a comment