![గ్రీన్‌ఫీల్డ్ హైవేకు రైతులు సహకరించాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07wgl107r-330080_mr-1738980763-0.jpg.webp?itok=wfmQFhqY)
గ్రీన్‌ఫీల్డ్ హైవేకు రైతులు సహకరించాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద
వరంగల్: జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే భూ సేకరణపై రైతులకు ఎలాంటి అపోహలు వద్దని, మెరుగైన పరిహారం అందించేలా కృషి చేస్తామని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే భూ సేకరణకు గీసుకొండ మండలం ఊకల్, మచ్చాపూర్, గ్రామాల రైతులతో కలెక్టర్ శుక్రవారం చర్చించారు. గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణానికి రైతులు భూములు ఇచ్చి సహకరించాలని కలెక్టర్ కోరారు.
వసతి గృహాల పనితీరు మెరుగుపడాలి..
జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, ప్రభుత్వ గురుకుల పాఠశాలల పనితీరు మెరుగుపడాలని కలెక్టర్ సత్య శారద అన్నారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల నిర్వహణపై మండల ప్రత్యేకాధికారులు, ప్రిన్సిపాళ్లతో కలెక్టరేట్‌లో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. డీఆర్‌ఓ విజయలక్ష్మి, ఎన్‌హెచ్ పీడీ దివ్య, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, టీం లీడర్ సంపత్‌కుమార్, డీఆర్డీఓ కౌసల్యాదేవి, డీఈఓ జ్ఞానేశ్వర్, ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, తహసీల్దార్ రియాజుద్దీన్, పర్యవేక్షకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన వైద్య సేవలందించాలి
ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలందించాలని వరంగల్ కలెక్టర్ సత శారద ఆదేశించారు. కలెక్టరేట్‌లో ప్రభుత్వ ఆస్పత్రుల పర్యవేక్షకులతో శుక్రవారం సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాలలోకి నర్సంపేట వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రి విలీనానికి చర్యలు తీసుకోవాలని వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, నర్సంపేట వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్‌దాస్, పర్యవేక్షకులు స్వామి, ప్రొఫెసర్ రాంకిషన్, డాక్టర్ రామ్మూర్తి, డాక్టర్ లత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment