![ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07ktm203-330114_mr-1738980807-0.jpg.webp?itok=ESGwuFX_)
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
కాళేశ్వరం దేవస్థానంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా ప్రారంభమైనట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. కాళేశ్వరం ఆలయంలో కలెక్టర్‌తోపాటు కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ శుక్రవారం పర్యటించారు. 9వ తేదీ ఆదివారం మహా కుంభాభిషేకం ముగింపు కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని, రద్దీకి తగినట్లు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. గోదావరి నదిలో స్నాన ఘట్టాలను పరిశీలించారు. భక్తుల వాహనాలు కేటాయించిన పార్కింగ్ ప్రాంతాలకు మళ్లించాలని కలెక్టర్ ఆదేశించారు. 70 మంది పారిశుద్ధ్య కార్మికులతో ప్రత్యేక పరిశుభ్రత చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వ్యర్థాల తరలింపునకు 2 ట్రాక్టర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యవసర వైద్య సేవలకు మహాదేవపూర్ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో బెడ్లు కేటాయించినట్లు తెలిపారు. గోదావరి వద్ద గజ ఈతగాళ్లు అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో డీపీఓ నారాయణ రావు, మండల ప్రత్యేక అధికారి వీరభద్రయ్య, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, దేవస్థానం ఈఓ మహేశ్, డీఈఈలు సాయిలు, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment