నూనె గింజల సాగు చేపట్టాలి
మామునూరు: నూనె గింజ పంటల సాగుపై రైతులు ప్రత్యేక దృష్టి సారిస్తే అధిక లాభాలు పొందవచ్చని జాతీయ ఆహార భద్రత మిషన్ కన్సల్టెంట్ సారంగం సూచించారు. ఖిలా వరంగల్ మండలం మామునూరు కృషివిజ్ఞాన కేంద్రం భవనంలో కేవీకే కోఆర్డినేటర్, సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ రాజన్న ఆధ్వర్యంలో ఐదో రోజు శుక్రవారం నూనె గింజల సాగుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మొక్కజొన్న పంట యాజమాన్య పద్ధతులు, విత్తనాల శుద్ధి ప్రాముఖ్యత, ఎరువులు, నీటి యాజమాన్యాన్ని వివరించారు. అనంతరం ప్రదర్శన క్షేత్రాలను నిర్వహించి, నూతన వంగడాలు, సాంకేతికతను రైతులకు పరిచయం చేశారు. ఈ సమావేశంలో డాక్టర్ సీహెచ్ సౌమ్య, డాక్టర్ రాజు, డాక్టర్ సాయికిరణ్, రైతులు పాల్గొన్నారు.
జాతీయ ఆహార భద్రత మిషన్
కన్సల్టెంట్ సారంగం
కృషివిజ్ఞాన కేంద్రంలో వృత్తి నైపుణ్య శిక్షణ
Comments
Please login to add a commentAdd a comment