![వివాహ విందులో ఘర్షణ..](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07plky055-330018_mr-1738980808-0.jpg.webp?itok=BP-EgCuF)
వివాహ విందులో ఘర్షణ..
● నలుగురికి గాయాలు
పాలకుర్తి టౌన్: వివాహ వేడుకలో భోజనాల వద్ద బంధువులు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్న ఘటన శుక్రవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగింది. జఫర్‌గడ్ మండలంలోని ఓబులాపురం గ్రామానికి చెందిన సోల్తి వీరస్వామి, స్వరూప కూతురు.. రాయపర్తి మండలంలోని కేశవాపురం గ్రామానికి చెందిన తాళ్లపెల్లి శ్రీనివాస్‌గౌడ్, ఉమ కుమారుడి వివాహవేడుకల్లో వివాదం చోటు చేసుకుంది. ఘర్షణ కుర్చీలతో కొట్టుకునేదాక వచ్చింది. మరికొంత మంది కుర్చీలను గాలిల్లోకి ఎగిరేశారు. వంట చేసే గరిటెలతో కొట్టుకున్నారు. దీంతో ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని బంధువులు పాలకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అందులో ఒకరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని పాలకుర్తి ఎస్సై పవన్‌కుమార్ సిబ్బందితో వెళ్లి సందర్శించారు. రెండు వర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment