![పెరుగుతున్న విద్యుత్ డిమాండ్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07hmkd51-330086_mr-1738980810-0.jpg.webp?itok=VPgkB6d7)
పెరుగుతున్న విద్యుత్ డిమాండ్
హన్మకొండ: ఎండల తీవ్రత, యాసంగి పంటల సాగు గణనీయంగా పెరగడంతో విద్యుత్ వినియోగం పెరుగుతుందని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి డైరెక్టర్లు, ఎన్పీడీసీఎల్ పరిధిలోని అన్ని సర్కిళ్ల సూపరింటెండెంట్ ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు, నోడల్ అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలు, డివిజన్‌ల వారీగా విద్యుత్ సరఫరా పరిస్థితిని, అభివృద్ధి పనులు, వేసవి కార్యాచరణపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 6న రాష్ట్రంలో అత్యధికంగా 15,752 మెగావాట్లు, ఎన్పీడీసీఎల్‌లో 5,328 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ పెరిగిందన్నారు. ప్రతి ఏటా మార్చిలో పెరిగే డిమాండ్ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పెరిగిందన్నారు. ఫిబ్రవరి నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో పాటు పంటల సాగుకు భూగర్భజలాల వినియోగానికి విద్యుత్ వినియోగం పెరుగడంతో విద్యుత్ డిమాండ్ పెరుగుతుందన్నారు. ఈ క్రమంలో అధికారులు ఎంతో జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలన్నారు. మార్చిలో మరింత లోడ్ పెరిగే అవకాశం ఉందని, దీనికి అనుగుణంగా వేసవి కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా ఇంటర్ లింకింగ్ లైన్లు, పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంపు పురోగతి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంపు, నిర్వహణ వేగంగా చేయాలన్నారు. లోడ్ పెరిగే అవకాశం ఉన్న ఫీడర్లలో లోడ్ బదలాయింపు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ డైరెక్టర్లు అశోక్ కుమార్, టి.సదర్ లాల్, సీఈ బీకం సింగ్, జీఎంలు అన్నపూర్ణ, నాగ ప్రసాద్, గౌతమ్ రెడ్డి, అంకుశ్, డీ.ఈ లు అనిల్ కుమార్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఎన్పీడీసీఎల్ పరిధిలో 5,328 మెగావాట్లకు చేరుకున్న వినియోగం
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment