మహబూబాబాద్ రూరల్ : సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి ఓ విద్యావంతుడైన యువరైతు ఆర్థికంగా నష్టపోయిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి.. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువ రైతు డిగ్రీ పూర్తిచేసి వ్యవసాయం చేస్తున్నాడు. గతేడాది సెప్టెంబర్ 11వ తేదీన అతడికి ఫోన్‌కు ఆన్ లైన్ ద్వారా జాబ్ కావాలా..? అంటూ ఓ లింకు వచ్చింది. ఆ లింకును ఓపెన్ చేసి టాస్క్ ఆడమని చెప్పగా అవతలి వ్యక్తులు ఇచ్చిన టాస్క్‌ను ఓపెన్ చేశాడు. ప్రతి టాస్కు రెండు గంటలకు రూ.150 చొప్పున పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయని అవతలి వ్యక్తులు నమ్మించారు. అది నమ్మిన సదరు యువరైతు దశలవారీగా రూ.90 వేల నగదును తన ఫోన్ పే నుంచి, మరో రూ.5 లక్షలను బ్యాంకు ఖాతా నుంచి ఆన్లైన్ జాబ్ ఇస్తామని చెప్పిన వ్యక్తుల ఖాతాలకు బదిలీ చేశాడు. రెండు మూడు రోజుల పైబడి తను పెట్టుబడి పెట్టిన డబ్బులను ఇవ్వమని అడగగా ఎదురు వ్యక్తులు స్పందించకపోవడంతో తాను సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయానని గుర్తించాడు. ఆ వెంటనే సైబర్ క్రైమ్ 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. కొద్దిరోజుల తర్వాత రూ.63 వేలు తన ఖాతాకు వచ్చినట్లు చూపించినప్పటీకీ డ్రా కావడంలేదు. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితుడు మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశాడు.
ఎఫ్‌పీయూ ఎస్సై
శివకుమార్‌కు కేంద్ర ట్రోఫీ
మహబూబాబాద్ రూరల్ : జిల్లా పోలీసు శాఖ పరిధిలోని ఫింగర్ ప్రింట్ యూనిట్ ఎస్సై ఈద శివకుమార్ కేంద్ర స్థాయిలో ఖాన్ బహదూర్ అజీజుల్ హక్ ట్రోఫీని కైవసం చేసుకున్నారు. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ ట్రోఫీని అందజేశారు. సెంట్రల్ ఫింగర్ ప్రింట్ బ్యూరో రాష్ట్రాల్లోని ఫింగర్ ప్రింట్ బ్యూరో విభా గాల్లో నియామకులైన పోలీసు అధికారులు, సిబ్బందికి నిర్వహించే ఆల్ ఇండియా బోర్డు పరీక్షల్లో శివకుమార్ ప్రథమ స్థానంలో నిలిచారు. న్యూఢిల్లీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, సీఎఫ్‌పీబీ ఆధ్వర్యంలో జనవరి 30, 31వ తేదీల్లో 25వ అఖిల భారత ఫింగర్ ప్రింట్ బ్యూరో నిర్దేశకుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర నేరపరిశోధన విభాగ డీజీపీ శిఖా గోయల్, ఫింగర్ ప్రింట్ బ్యూరో డైరెక్టర్ ఎండీ తాతారావు, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఎస్సై శివకుమార్‌ను అభినందించారు.
● టాస్క్ పూర్తి చేయాలన్న సైబర్ నేరగాళ్లు
● రూ.5.90 లక్షలు నష్టపోయిన యువరైతు
Comments
Please login to add a commentAdd a comment