![నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తుల స్వాధీనం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07ktm206-330114_mr-1738980811-0.jpg.webp?itok=mxwiLyyP)
నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తుల స్వాధీనం
● మహదేవపూర్‌లో సీసీఎస్ పోలీసుల మెరుపుదాడి
కాళేశ్వరం: నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులను రవాణా చేస్తున్న గూడ్స్ వాహనాన్ని సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. మహదేవపూర్ ఎస్సై పవన్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం కాటారం వైపు నుంచి మహదేవపూర్‌కు తరలి వస్తున్న గూడ్స్ వాహనంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన వేల్పుల సంతోష్, షేక్ పర్వేజ్‌లు కలిసి నిషేధిత గుట్కా, అంబార్, పొగాకు ఉత్పత్తులను రవాణా చేస్తు పట్టుబడ్డారు. వారిని పోలీసులు విచారించగా గోదావరిఖనికి చెందిన చిదిరాల నాగరాజు వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి లాభాల కోసం గత కొన్నేళ్లుగా వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. పట్టుకున్న గుట్కా, అంబర్, పొగాకు ఉత్పత్తుల విలువ రూ.7.92 లక్షల వరకు ఉంటుందని ఎస్సై తెలిపారు. హెడ్‌కానిస్టేబుల్ జే.శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వాహనాన్ని, ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment