![అక్కక](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07drk252-330134_mr-1738980812-0.jpg.webp?itok=R2vOaRqk)
అక్కకు ఆలయం..
మరిపెడ రూరల్: అక్క చనిపోయి 20 ఏళ్లయింది. ఆమె స్మారకంగా సోదరులు ఆలయం కట్టించి అందులో ఆమె విగ్రహాన్ని ప్రతిష్ఠించి తమ తోడబుట్టిన అనుబంధాన్ని చాటుకున్నారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బీచ్‌రాజుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని జర్పులతండాలో శుక్రవారం చోటు చేసుకుంది. జర్పులతండాకు చెందిన జర్పుల బాలు – లక్ష్మీ దంపతులకు ఐదుగురు సంతానం. వీరిలో ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. పెద్దకుమార్తె అచ్చమ్మబాయి అ నారోగ్యంతో 20ఏళ్ల క్రితం చనిపోయింది. ఆమైపె ఉన్న మమకారంతో తండా శివారులో చిన్న ఆలయం నిర్మించి కుటుంబ సభ్యులు నిత్యం పూజలు చేసేవారు. అనంతరం ఆమె ఇద్దరు సోదరులు రంగానాయక్, మోహన్‌నాయక్‌లు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. సోదరిని దేవతగా పూ జిస్తున్న వారు అనుకున్నట్లుగా రూ.20 లక్షలతో గుడిని ని ర్మించి అచ్చమ్మబాయి విగ్రహాన్ని శుక్రవారం వేదపండితు ల మంత్రోచ్ఛరణల నడుమ ప్రతిష్ఠించి పూజలు చేశారు.
20 ఏళ్ల క్రితం అనారోగ్యంతో
చనిపోయిన అచ్చమ్మబాయి
స్మారకంగా ఆలయం నిర్మించి
అనుబంధాన్ని చాటుకున్న సోదరులు
![అక్కకు ఆలయం..1](https://www.sakshi.com/gallery_images/2025/02/8/07drk253r-330134_mr-1738980812-1.jpg)
అక్కకు ఆలయం..
Comments
Please login to add a commentAdd a comment