ఆదివారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

ఆదివారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

Published Sun, Feb 9 2025 1:23 AM | Last Updated on Sun, Feb 9 2025 1:23 AM

ఆదివా

ఆదివారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

10లోu

మాతృ దేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్య దేవోభవ.. ఇలా మన పెద్దలు తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువులకు ఇచ్చారు. విద్యార్థులకు తరగతి గదిలో విద్యాబుద్ధులు నేర్పి వారిని ఉన్నత స్థానంలో నిలపాల్సిన కొందరు ఉపాధ్యాయులు దారి తప్పుతున్నారు. పాఠశాలలకు వచ్చే బిడ్డల్లాంటి విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నారు. ఆ విషయాన్ని బాధిత విద్యార్థులు అటు తల్లిదండ్రులకు, ఇటు సన్నిహితులకు చెప్పుకోలేక లోలోపల కుమిలిపోతున్నారు. లైంగిక వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో చివరికి ధైర్యం తెచ్చుకుని తల్లిదండ్రులకు చెబుతున్నారు. పాఠశాల స్థాయి విద్యార్థినులకు ‘ఏది గుడ్‌ టచ్‌.. ఏది బ్యాడ్‌ టచ్‌’ అనేది తల్లిదండ్రులు ఇంటి వద్దనే నేర్పించాలని, బ్యాడ్‌ టచ్‌ అయితే భయపడకుండా చెప్పాల్సిన అవసరం ఉందని మానసిక వికాస నిపుణులు చెబుతున్నారు.

– తొర్రూరు/కాజీపేట

జనవరిలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం దొబ్బలపాడు మోడల్‌ స్కూల్‌కు చెందిన ఐదుగురు విద్యార్థినులను సీఎం కప్‌ పోటీల నిమిత్తం హైదరాబా ద్‌కు తీసుకెళ్లిన పీఈటీ వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. విచారణ చేసి అతడిని సస్పెండ్‌ చేశారు.

ఇటీవల తొర్రూరు మండలం అరిపిరాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటన వెలుగు చూసింది. ఉపాధ్యాయుల వేధింపుల వ్యవహారం బయటకు పొక్కడంతో పాఠశాలకు చేరుకుని తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన చేపట్టి వారికి దేహశుద్ధి చేశారు.

మహబూబాబాద్‌ జిల్లా సీరోలు మండలం సక్రాంనాయక్‌ తండాలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు చిన్నారుల కు నీలి చిత్రాలు చూపించాడు. తమతో ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు టీచర్‌కు దేహశుద్ధి చేశారు. సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేశారు.

రెండేళ్ల క్రితం దంతాలపల్లి మండలం దాట్ల గ్రామ ఉన్నత పాఠశాలలోని ఓ ఉపాధ్యాయుడు క్రీడల పేరిట తాకరాని చోట తాకుతూ విద్యార్థినులను వేధించాడు. విషయం బయటకు పొక్కడంతో టీచర్‌పై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేశారు.

చెడు స్పర్శ

ఛాతిపై చేయి వేయడం, నడుం కింద, వెనుకవైపు తాకడం, అనుచితంగా ప్రవర్తించడం, అసభ్యకర రీతిలో వ్యవహరించడం.

మంచి స్పర్శ

తల, వీపుపై తట్టడం, కరచాలనం, ప్రశంసిస్తూ బుగ్గలు, చెవులను తాకడం

ఫిర్యాదుకు భయపడొద్దు..

చిన్నతనం నుంచి బాలికల్లో ధైర్యాన్ని నూరిపోయాలి. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, ఇంకా ఏమైనా జరిగినా వెంటనే తల్లిదండ్రులకు చెప్పాలి. ఇంట్లో చెబితే తనను నిందిస్తారని బాలికలు భయపడొద్దు. లేదంటే ఆ సమస్య పెద్దగా మారే ప్రమాదం ఉంది. పిల్లలు చెప్పే విషయాన్ని తల్లిదండ్రులు సావధానంగా వినాలి. అంతే కానీ, వారి మనసుకు కష్టం కలిగేలా మాట్లాడకూడదు. ఫిర్యాదు చేస్తే సమాజంలో ఏమనుకుంటారో అని తల్లిదండ్రులు కూడా భయపడొద్దు. ఆపద సమయంలో బాలికలు వెంటనే 100 నంబర్‌కు డయల్‌ చేయడం ఉత్తమం.

– వై.సుధాకర్‌రెడ్డి, సీఐ, కాజీపేట

చిన్నప్పటినుంచే అవగాహన కల్పించాలి

తల్లిదండ్రులు ఆడపిల్లలకు మంచి చెడులు వివరించి చెప్పాలి. బ్యాడ్‌టచ్‌, గుడ్‌ టచ్‌ అంటే ఏమిటి? వాటి పర్యవసానాలను ఎలా ఎదుర్కోవాలనే విషయంపై అవగాహన కల్పించాలి. పిల్లలను ఇష్టారీతిగా తాకితే వెంటనే రియాక్ట్‌ అయ్యేలా చూడాలి. పిల్లలు ఇటువంటి అనుభవం ఎదురైనప్పుడు నిర్భయంగా తల్లికి చెప్పుకునేలా మనోధైర్యం కల్పించాలి. బయట ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేలా తయారు చేయాలి.

– అశోక్‌ పరికిపండ్ల, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ సభ్యుడు, సైకాలజిస్ట్‌

అనైతిక, క్షమార్హం కాని చర్యలకు పాల్పడుతున్న పలువురు ఉపాధ్యాయుల తీరుతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివించే ఆర్థిక స్థోమత లేక పేదింటి తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నారు. పలు ప్రాంతాల్లో చిన్నారులపై వేధింపుల ఘటనలు వెలుగు చూస్తుండటంతో కన్నవారు కుమిలిపోతున్నారు. చదువు మాన్పించేందుకు సైతం తల్లిదండ్రులు వెనుకాడడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు సన్నగిల్లే అవకా శం ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఉపాధ్యాయులపై నిఘా ఉంచాల ని, తప్పు చేసినట్లు తేలితే కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు.

వరంగల్‌ జిల్లా పరిధిలోని అన్ని గురుకులాలు, కేజీబీవీలు, ప్రభుత్వ పాఠశాలల్లో కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థినులు నేరుగా చెప్పుకోలేని సమస్యలను తెలుసుకునేందుకు ఫిర్యాదు పెట్టెలను ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేశారు. నేరుగా చెప్పలేని సమస్యలను విద్యార్థులు పేపర్‌పై రాసి ఆ ఫిర్యాదు పెట్టెలో వేస్తున్నారు. ఈ పెట్టెల నిర్వహణను స్వయంగా కలెక్టరే చూస్తున్నారు. ఇటీవల నెక్కొండలోని గురుకులం, కేజీబీవీలో ఆ ఫిర్యాదు పెట్టెలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి ఇద్దరు ప్రిన్సిపాళ్లు, వార్డెన్‌, పీఈటీకి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఇలాంటి ఫిర్యాదు పెట్టెలను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఉపాధ్యాయుల వికృత చేష్టలను విద్యాశాఖ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. దీంతో కొందరు గురువులు తమ మానసిక ఆనందం కోసం బిడ్డల్లాంటి చిన్నారులపై మృగాలుగా ప్రవర్తిస్తూ వృత్తికే కళంకం తీసుకువస్తున్నారు.

న్యూస్‌రీల్‌

విద్యార్థినులకు చెబుదాం..

ఎవరైనా అసభ్యంగా తాకినా వద్దని చెప్పే ధైర్యం నూరిపోయాలి. కుటుంబ సభ్యులతోనూ నడుచుకోవాల్సిన విధానం వివరించాలి.

బడుల్లో మహిళా ఉపాధ్యాయులు, మార్గదర్శకులు అర్థమయ్యేలా వివరించాలి. రోజువారీ విషయాలు తమతో ఆడపిల్లలు పంచుకునే వాతావరణం తల్లిదండ్రులు కల్పించాలి. ఆత్మరక్షణ విద్య నేర్పించాలి.

పోలీసులతోపాటు విద్య, వైద్య, ఆరోగ్య, ఐసీడీఎస్‌ విభాగాల అధికారులు తరచూ పాఠశాలలను సందర్శించాలి. పక్కాగా కమిటీలు వేయాలి.

విద్య, శిక్షణ సంస్థల్లో పనిచేసే సిబ్బంది పూర్వాపరాలు తెలుసుకోవాలి.

పాఠశాలల వద్ద ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం చేరవేయాలి.

విద్యాసంస్థల్లో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి.

ఉమ్మడి జిల్లాలో జరిగిన ఘటనలు

ఏది గుడ్‌ టచ్‌.. ఏది బ్యాడ్‌ టచ్‌విద్యార్థినులపై ఉపాధ్యాయుల లైంగిక వేధింపులు, అనుచిత ప్రవర్తన

కొందరు ఉపాధ్యాయుల తీరుతో విద్యాశాఖకు మచ్చ పాఠశాలల్లో చోటుచేసుకుంటున్న ఘటనలతో తల్లిదండ్రుల ఆందోళన

తల్లిదండ్రుల్లో ఆందోళన..

అన్ని జిల్లాల్లో ఇలా చేస్తే బెటర్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
ఆదివారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20251
1/6

ఆదివారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

ఆదివారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20252
2/6

ఆదివారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

ఆదివారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20253
3/6

ఆదివారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

ఆదివారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20254
4/6

ఆదివారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

ఆదివారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20255
5/6

ఆదివారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

ఆదివారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20256
6/6

ఆదివారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement