![ఎన్‌హెచ్‌పీ లక్ష్యాలు పూర్తి చేయాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/08wgl226-330082_mr-1739044334-0.jpg.webp?itok=louWwbuG)
ఎన్‌హెచ్‌పీ లక్ష్యాలు పూర్తి చేయాలి
ఎంజీఎం: జాతీయ ఆరోగ్య కార్యక్రమం(ఎన్‌హెచ్‌పీ)లో నిర్దేశించిన లక్ష్యాలను నూరు శాతం పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య ఆదేశించారు. శనివారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో పీహెచ్‌సీ, పల్లె, బస్తీ దవాఖానల వైద్యాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ ఆరోగ్య కార్యక్ర మం అమలు వెనుకంజలో ఉంటే తెలుసుకుని ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలతో సమీక్ష నిర్వహించి ప్రగతి సాధించాలన్నారు. వైద్యాధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, ఆరోగ్య మహిళా క్లినిక్‌లలో రోజూ కనీసం 50 మంది మహిళలకు పరీక్షలు నిర్వహించాలన్నారు. టీబీ తెమడ పరీక్షలు నిర్వహిస్తూనే తమ పరిధిలోని టీబీ, బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు మెరుగైన ఫాలోఅప్ సేవలు అందించాలని చెప్పారు. మాతా, శిశు సంక్షేమ కార్యక్రమంలో భాగంగా వంద శాతం గర్భిణులను 12 వారాల్లోపే గుర్తించి నమోదు చేయాలని సూచించా రు. వైద్యాధికారులు ప్రతీ రిపోర్టును ఎప్పటికప్పు డు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడంతోపాటు ఈ ఔషధి పోర్టల్‌లో మందుల వివరాలను నమోదు చేయాలన్నారు. గర్భిణులు, వారి కుటుంబ సభ్యులకు శిశు సంక్షేమ శాఖ మెప్మా, ఐకేపీ వారితో పీఎన్‌డీటీ, ఎంపీటీ చట్టంపై అవగాహన కల్పించాలని సూచించారు. లింగ నిర్ధారణ, అబార్షన్ల గురించి 104, 1098, 181, డయల్ 100 టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలని చెప్పారు. ఈనెల 10న నిర్వహించాల్సిన నులి పురుగుల నివారణ కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. అనంతరం ‘బేటీ బచావో– బేటీ పడావో’ కార్యక్రమంలో భాగంగా వైద్యాధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. అడిషనల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ మదన్‌మోహన్‌రావు, జిల్లా క్షయ నియంత్రణాధికారి డాక్టర్ హిమ బిందు, ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఇఫ్తాదర్, డాక్టర్ మంజుల, జిల్లా మాస్ మీడియా అధికారి వి.అశోక్‌రెడ్డి, ఎస్‌ఓ ప్రసన్నకుమార్, ప్రవీణ్, వైద్యాధికారులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ అప్పయ్య
Comments
Please login to add a commentAdd a comment