‘ప్రజావాణి’ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి
అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ అనుదీప్
సాక్షి, సిటీబ్యూరో: ప్రజావాణి దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అదనపు కలెక్టర్ కదిరవన్ పలనితో కలసి ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వివిధ సమస్యలపై చేసుకున్న దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పక్కాగా జరగాలని, ఆ దిశగా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ వెంకటాచారి, ఆర్డీఓలు రామకృష్ణ, సాయిరామ్ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment