కొత్త చట్టాలపై అవగాహన
చంచల్‌గూడ: కొత్త చట్టాలపై జైలు అధికారులు, సిబ్బందికి అవగాహన ఉండాలని జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్యమిశ్రా అన్నారు. రాష్ట్ర జైళ్ల శాఖ, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవ్‌లప్‌మెంట్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో కారాగార సంబంధిత విషయాలపై కొత్త నేరచట్టాలు–2023పై జైళ్ల శాఖ అధికారులకు, సిబ్బందికి చంచల్‌గూడలోని సీకా శిక్షణ సంస్థ అవగాహన కల్పిస్తోంది. గత నెలలో మొదటి విడత అవగాహన సదస్సును నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడు రోజులపాటు సాగే రెండో విడత సదస్సును సోమవారం సౌమ్యమిశ్రా ప్రారంభించారు. సదస్సులో మేఘాలయ, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల జైళ్ల శాఖ అధికారులు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఐజీలు యెర్రంశెట్టి రాజేశ్, మురళీబాబు, డీఐజీలు డాక్టర్ శ్రీనివాస్, సంపత్, సూపరింటెండెంట్ నవాబు శివకుమార్‌గౌడ్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment