ప్రపంచవ్యాప్తంగా మెటా సేవలు స్తంభించాయి. మెటా నెట్‌వర్క్ పరిధిలో ఉన్న ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలకు విఘాతం కలిగింది. దీంతో యూజర్లు అల్లలాడిపోతున్నారు. ఏం జరిగిందో చెప్పాలంటూ.. ఎక్స్ (ట్విటర్) వేదికగా మెటా నెట్‌వర్క్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే మెటా పరిధిలోని వాట్సాప్ సేవలు మాత్రం యధావిధిగా కొనసాగుతున్నాయి. సాంకేతికలోపం వల్లే మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్) సర్వీసులు నిలిచిపోయి ఉండొచ్చని తెలుస్తోంది.
సాంకేతిక సమస్య వల్ల ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల కంటే ఎక్కువ మంది ఫేస్‌బుక్ యూజర్లు, 47000 కంటే ఎక్కువ మంది ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మెటా అధికారికంగా స్పందించాల్సి ఉంది.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సమస్యలను నివేదించడానికి వందలాది యూజర్లు మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్ (ట్విట్టర్) ఉపయోగిస్తున్నారు. ఇందులో మెటా డౌన్ అయిందా, లేదా నేను హ్యాక్ చేయబడుతున్నానా?, నా ఇన్‌స్టాగ్రామ్ లోడ్ కావడం లేదు, ఫేస్‌బుక్ & ఇన్‌స్టాగ్రామ్ ఒక సెకను హ్యాక్ అయిందని అనుకున్నన్నానాని.. కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment