ఏటా వస్తాం | Sakshi
Sakshi News home page

ఏటా వస్తాం

Published Sat, Apr 20 2024 1:55 AM

- - Sakshi

ఏటా మామిడి సీజన్‌లో జగిత్యాలకు వస్తుంటాం. నెల రోజుల పాటు ఇక్కడ పనిచేస్తాం. కనీసం రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు సంపాదిస్తాం. మహారాష్ట్రలో పనులు లేకపోవడంతో ఉపాధి కోసం ఇక్కడకు వస్తాం.

– సేవాలాల్‌, మహారాష్ట్ర

ప్యాకింగ్‌ కోసం..

మామిడికాయలను గ్రేడింగ్‌ చేసి, ప్యాకింగ్‌ చేసేందుకు ఇక్కడకు వస్తాం. మా రాష్ట్రం నుంచి కనీసం 500 మంది వరకు వచ్చారు. మామిడి మార్కెట్లో ఏదో పని దొరుకుతుందనే ఆశతో వచ్చి, ఎంతో కొంత సంపాదించుకుని వెళ్తాం.

– గుడ్డె, ఉత్తరప్రదేశ్‌

కనీస వసతులు కల్పిస్తున్నాం

మామిడి మార్కెకు అన్ని రా ష్ట్రాలకు సంబంధించి 4వేల నుంచి 5 వేల మంది వచ్చా రు. కాయలు తెంపడం నుంచి గ్రేడింగ్‌ చేసి, ట్రేలలో ప్యాకింగ్‌ చేయడం, లారీల్లో నింపడం చేస్తుంటారు. వారికి కనీస వసతులు కల్పిస్తున్నాం. – ఎండీ.మోయిన్‌, వ్యాపారుల

సంఘం అధ్యక్షుడు, జగిత్యాల

1/2

2/2

Advertisement
Advertisement