బిల్లు ఇవ్వలేదని ఎంపీడీవో కార్యాలయానికి తాళం?
ఇబ్రహీంపట్నం: పనులు చేసినా బిల్లులు చెల్లించకపోవడంతో ఆగ్రహానికి గురైన మండలంలోని వేములకుర్తి మాజీ సర్పంచ్ భర్త బుధవారం ఎంపీడీవో కార్యాలయానికి తాళం వేసేందుకు సిద్ధమయ్యాడు. బాధితుడి కథనం ప్రకారం.. మాజీ సర్పంచ్ సున్నం నవ్యశ్రీ భర్త సత్యం గ్రామంలో గతేడాది ఫిబ్రవరిలో ఉపాధి హామీ నిధులు రూ.5 లక్షలతో సీసీ రోడ్డు పనులు చేశాడు. ఎంబీ రికార్డు కూడా పూర్తయ్యింది. ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ (ఎఫ్‌టివో)ను ఈ ఏడాది జనవరి 27న పంచాయతీ రాజ్ డీఈ, ఏఈల సంతకంతో తీసుకొచ్చినా వేములకుర్తి గ్రామ ప్రత్యేక అధికారి, ఎంపీడీవో చంద్రశేఖర్ బిల్లు ఇవ్వడం లేదని, నిత్యం ఏదో కారణం చెబుతూ తిప్పిస్తున్నాడు. దీంతో ఆగ్రహా నికి గురైన సత్యం ఎంపీడీవో కార్యాలయానికి బిల్లు కోసం వ చ్చాడు. బిల్లు ఇచ్చేవరకూ కార్యాలయానికి తాళం వేస్తానని సి ద్ధంకావడంతో వేములకుర్తి పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ అ డ్డుకుని నచ్చజెప్పాడు. గ్రామ ప్రత్యేకాధికారి, ఎంపీడీవో చంద్రశేఖర్‌తో వాదనకు దిగాడు. ఎంబీ రికార్డ్స్ జిరాక్స్, ఎఫ్‌టీవో జి రాక్స్ కాపీలపై పంచాయతీరాజ్ ఏఈ లేదా డీఈల సంతకం తీసుకొస్తే బిల్లు ఇస్తానని ఎంపీడీవో తెలిపారు. అప్పు చేసి గ్రా మంలో వైకుంఠధామం, కళావేదిక, గ్రామపంచాయతీ భవనం నిర్మించానని, ఇప్పటికీ బిల్లులు రాలేదని సత్యం అవేదన వ్యక్తం చేశాడు. ఎంపీడీవో మాట్లాడుతూ.. గతంలో ఎఫ్‌టీవోలపై సంతకాలు లేకుండానే బిల్లులు డ్రా చేశాడని, తాను అలాంటి తప్పులు చేయబోనని తెలిపారు.
ఆందోళనకు దిగిన మాజీ సర్పంచ్ భర్త
అడ్డుకున్న పంచాయతీ కార్యదర్శి
ఎంపీడీవోతో వాగ్వివాదానికి దిగిన వైనం
Comments
Please login to add a commentAdd a comment