ఎస్సైకి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య
రామడుగు: తన తల్లికి స్థలాన్ని అమ్మిన మహిళ, అదే స్థలాన్ని మరొకరికి విక్రయించడంతో పాటు కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరింపులకు పాల్పడడంతో మండలంలోని వెలిచాల గ్రామానికి చెందిన దైవాల రమేశ్(35) ఎస్సైకి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. కొత్తపల్లి మండలానికి చెందిన ఓ మహిళ 2004లో మృతుడి తల్లి వరమ్మకు 35 గుంటల స్థలాన్ని విక్రయించగా రమేశ్ పంటలు సాగు చేసుకుంటున్నాడు. ఇదే స్థలాన్ని మరో వ్యక్తికి అమ్మినట్టు తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించింది. ఇదేంటని ప్రశ్నించగా కుటుంబసభ్యులను చంపుతామని బెదిరించడంతో మనోవేధనకు గురైన రమేశ్ బుధవారం గ్రామ పరిధిలోని అయ్యవారి కుంటలో పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య శ్రీలత ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని, రమేశ్‌కు ముగ్గురు పిల్లలని ఎస్సై వి.శేఖర్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment