గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి
మల్యాల(చొప్పదండి): మల్యాల మండలం నూకపల్లి శివారు జగిత్యాల–కరీంనగర్ జాతీయ రహదారిపై వరదకాలువ సమీపంలో బుధవారం రాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. ఎస్సై నరేశ్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు సేకరిస్తున్నామని, వ్యక్తిని ఢీకొన్న వాహనాన్ని సీసీ పుటేజీల ద్వారా గుర్తించేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఎస్సై తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
అంజన్నను దర్శించుకున్న అఘోరి
కొండగట్టు/వేములవాడఅర్బన్ వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్నను బుధవారం అఘోరి దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. సనాతన ధర్మంపై అవగాహన కల్పించడం కోసమే ఆలయాలు సందర్శిస్తున్నట్లు తెలిపారు. అయితే ఆమెను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment