అనుమానం పెనుభూతమై..
మల్లాపూర్ : అనుమానం పెనుభూతమై భార్యను గొంతు నొ క్కి అతికిరాతకంగా చంపేశాడోభర్త. ఈ దారుణం మండలంలోని వెంకట్రావ్‌పేటలో బుధవారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని వేంపల్లి గ్రామానికి చెందిన వెల్మల రమేశ్‌కు రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన సునీతతో 2015లో వివాహం జరిపించారు. వీరికి కూతురు ఆద్య (8), కుమారుడు జయసూర్య(6) సంతానం. కొంతకాలంగా వెంకట్రావ్‌పేటలో ఉంటున్నారు. రమేశ్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి వస్తున్నాడు. నెలక్రితం దుబాయి నుంచి వచ్చి న రమేశ్‌కు సునీత వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానం కలిగింది. ఇదే విషయమై బుధవారం ఉదయం భార్యాభర్తలు గొడవపడ్డారు. దీంతో రమేశ్ క్షణికావేశంలో సునీత ముఖంపై బలంగా కొట్టాడు. గొంతు నులిమి హతమార్చి అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న సునీత కుటుంబసభ్యులు ఘటనాస్థలికి వెళ్లి బోరున విలపించారు. గ్రామస్తుల సమాచారం మేరకు ఎస్సై కిరణ్‌కుమార్ విచారణ చేపట్టారు. మెట్‌పల్లి డీఎస్పీ ఉమామహేశ్వర్‌రావు, కోరుట్ల సీఐ సురేష్‌బాబు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతురాలు తండ్రి మందల గంగరాజం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
భార్యను చంపిన భర్త
పరారీలో నిందితుడు
Comments
Please login to add a commentAdd a comment