బైక్‌ను ఢీకొట్టిన లారీ
శంకరపట్నం(మానకొండూర్): బైక్‌ను లారీ ఢీకొనడంతో మండలంలోని మక్త గ్రామానికి చెందిన పంచకోటి గోపి(30) మృతిచెందాడు. ఎస్సై రవి తెలిపిన వివరాలు.. వంకాయగూడెం శివారులోని హోటల్‌లో మంగళవారం ఽరాత్రి గోపి సర్వపిండి కొనుక్కొని హార్వెస్టర్ రిపేర్ చేస్తున్న మెకానిక్ వద్దకు బైక్‌పై వెళ్తుండగా కరీంనగర్ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. మృతుడి సోదరుడు రమేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.
హార్వెస్టర్ యజమాని ఇంటి ఎదుట ఆందోళన
కేశవపట్నం గ్రామానికి చెందిన సౌమిత్‌రెడ్డి హార్వెస్టర్ పనికి పిలవడంతోనే చనిపోయాడని గోపి కుటుంబం సభ్యులు ఆందోళన చేశారు. పోస్టుమార్టం అనంతరం శవాన్ని గ్రామానికి తీసుకెళ్లకుండా హార్వెస్టర్ యజమాని ఇంటిఎదుట ఉంచడంతో గంటసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. యజమానితో రాజీ కుదరడంతో మృతదేహాన్ని మక్తకు తరలించినట్లు తెలిసింది.
యువకుడి దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment