దొంగల ముఠా అరెస్టు
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ బస్టాండులో దొంగతనాలు చేస్తున్న అంతర్ రాష్ట్రముఠాలోని నలుగురు నిందితులను వన్‌టౌన్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సీఐ బిల్లా కోటేశ్వర్ వివరాల ప్రకారం మహారాష్ట్రలోని జలగాం జిల్లా భూసవల్ గ్రామానికి చెందిన పసుపులేటి దుర్గ, పసుపులేటి రాం, పసుపులేటి రవి, పసుపులేటి రేణు చీరలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల కరీంనగర్ బస్టాండుకు కారులో వచ్చారు. రద్దీగా ఉన్న ఫ్లాట్‌పాం వద్దకు వెళ్లి బస్సు ఎక్కుతున్న మహిళల బ్యాగు నుంచి బంగారం, నగలు దొంగిలించారు. కారులో మహారాష్ట్ర వెళ్లి దొంగలించిన సొమ్ము విక్రయించారు. బుధవారం నగరంలోని డీర్‌పార్కు వద్ద అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు తనిఖీ చేశారు. వారినుంచి రూ.36వేల నగదు, 23గ్రాముల బంగారం, ఎనిమిది సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం చేసుకుని, నలుగురిని అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment