పూర్తి చేస్తాం | - | Sakshi
Sakshi News home page

పూర్తి చేస్తాం

Published Thu, Nov 21 2024 1:03 AM | Last Updated on Thu, Nov 21 2024 1:03 AM

పూర్త

పూర్తి చేస్తాం

● ఈనెల 30న ఎమ్మెల్యేలతో మంత్రి ఉత్తమ్‌ సమీక్ష చేస్తారు ● కాళేశ్వరంతో పనిలేకుండా అత్యధిక వరి ఉత్పత్తి ● పాదయాత్ర సమయంలో వాగ్దానాలు పూర్తి చేస్తున్నామన్న సీఎం ● కేసీఆర్‌ పాలనపై మంత్రుల విమర్శలు ● ఇందిరమ్మ రాజ్యంతోనే సంక్షేమం, అభివృద్ధని స్పష్టీకరణ ● రూ.679 కోట్ల పనులకు శంకుస్థాపన

పెండింగ్‌

ప్రాజెక్టులు

మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి

సీఎం రేవంత్‌ పర్యటన

ఇలా..

● ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి హెలీకాప్టర్‌ ద్వారా వేములవాడ గుడి చెరువు చేరుకున్నారు. అనంతరం ప్రత్యేక కాన్వాయ్‌ ద్వారా ఆలయ గెస్ట్‌హౌస్‌కు వెళ్లారు.

● మంత్రి శ్రీధర్‌బాబు, దేవాదాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజారామయ్యర్‌

దంపతులు ఒకేచోట కలుసుకుని సీఎం

రేవంత్‌రెడ్డికి స్వాగతం పలుకుతున్న

క్రమంలో అన్నా, వదిన ఒకేచోట

అంటూ సీఎం మాట్లాడారు.

● గెస్ట్‌హౌస్‌ నుంచి సీఎం లుంగీ–కండువా ధరించి రాజన్న దర్శనానికి వెళ్లారు. అంతకుముందు పోలీసులు గౌరవవందనం సమర్పించారు.

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌/వేములవాడ/వేములవాడఅర్బన్‌: అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, ఈ నెల 30 లోపు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహిస్తారని, ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయి, ఎన్ని నిధులు కావాలి అనేది సమీక్షలో మాట్లాడుతారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం వేములవాడ రాజన్న దర్శనం అనంతరం ఆలయ గుడి చెరువు ఖాళీ స్థలంలో రూ.679 కోట్లతో అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రజాపాలన విజయోత్సవ సభకు హాజరై మాట్లాడారు. కరీంనగర్‌ జిల్లా నుంచి పీవీ నరసింహారావు దేశానికి దిశ దశ చూపి, గ్రామస్థాయి నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ బిడ్డ పరిపాలన అంటే ఎంటో చూపించారన్నారు. అలాగే పెద్దలు చొక్కారావు, ఎం.సత్యనారాయణరావు లాంటి వారు కరీంనగర్‌ నుంచి నాయకత్వం అందించారని గుర్తు చేశారు. అనంతరం వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడారు. వేములవాడ అభివృద్ధికి అన్ని శాఖల మంత్రులు సంపూర్ణ సహకారం అందించారన్నారు. రూ.76 కోట్లతో రాజన్న ఆలయ విస్తరణ పనులు శృంగేరిపీఠాధిపతుల సూచనల మేరకు నిర్వహిస్తున్నామని వివరించారు. వేములవాడలో రూ.35 కోట్లతో నిత్య అన్నదానసత్రానికి సీఎం సభకు వచ్చే ముందు ఉత్తర్వులు జారీ అయ్యాయని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, గత దశాబ్ద కాలంలో నిర్లక్ష్యానికి గురైన వేములవాడ పట్టణ పునర్నిర్మాణం పనులను 10 నెలల కాలంలో ప్రారంభించుకున్నామని వెల్లడించారు. గల్ఫ్‌ కార్మికులు మరణిస్తే దేశంలోనే రాష్ట్రంలో రూ.5 లక్షల పరహారం అందిస్తున్న ఏకై క ప్రభుత్వం అని పేర్కొన్నారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఎగవేసిన బకాయిలు చెల్లిస్తూనే 30 ఏళ్ల చిరకాల కోరిక యారన్‌ డిపో ఏర్పాటు చేశామని వెల్లడించారు. 365 రోజులు నేత కార్మికులకు పని కల్పించే సంకల్పం ప్రభుత్వం తీసుకుందన్నారు. రాజన్న దయతో దేశంలోనే అత్యధికంగా వరిపంట దిగుబడి వచ్చిన రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. కోటి 53 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వచ్చిందన్నారు. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, మనందరి కష్టం ఫలితంగా ఇందిరమ్మ రాజ్యం రాష్ట్రంలో ఏర్పడిందన్నారు. రాబోయే నాలుగేళ్లలో రూ.లక్ష కోట్లతో పేదలకు 20 లక్షల ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రాజకీయాలు, కులాలకతీతంగా పేదలకు ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. బీసీ, రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ, చిరకాల ఆకాంక్ష నిత్యాన్నదాన సత్రానికి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గతంలో వాగ్దానాలకు పరిమితమైన వేములవాడ ఆలయానికి నేడు అభివృద్ధి బాటలు వేశామని తెలిపారు. రాబోయే రోజుల్లో నేత కార్మికుల ఉపాధికి బృహత్తర ప్రణాళికలు రూపొందిస్తామని ప్రకటించారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, నిరంతరం ప్రజల్లో తిరిగే శ్రమజీవి విప్‌ ఆది శ్రీనివాస్‌ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారన్నారు. పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రతీ ఎకరం సాగయ్యే దిశగా చర్యలు తీసుకుంటామని వివరించారు. టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ.. రుద్రంగి ఇవతల మర్రిపల్లి అమ్మమ్మ ఊరు, అవతల నాన్నమ్మ ఊరని తెలిపారు. పది నెలల కాలంలోనే 50 వేల ఉద్యోగాలు అందించామన్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతీ మాట నిలబెడుతామన్నారు. నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ స్టేజ్‌– 2, ఫేజ్‌– 1 పనులు పూర్తి చేసి లక్షా 51 వేల 400 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ఎల్లంపల్లి కెనాల్‌ నెట్‌వర్క్‌ ప్యాకేజీ– 2లో పెండింగ్‌ పనులకు రూ.170 కోట్లు ఖర్చు చేసి వేములవాడ నియోజకవర్గంలో 40,500 ఎకరాలు, కోరుట్లలో 2,500 ఎకరాలకు నీరు అందిస్తామన్నారు. సిరిసిల్లలో కాళేశ్వరం ప్యాకేజీ 9,10,11 పూర్తి చేసి లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా నీటిపారుదల ప్రాజెక్టులపై వారం రోజుల్లో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, మక్కాన్‌సింగ్‌, విజయరమణారావు తదితరులు పాల్గొన్నారు.

ఆదిపై ప్రశంసల జల్లు..

వేములవాడకు బుధవారం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.679 కోట్ల నిధులు, ఆలయ విస్తరణ పనుల విషయంలో స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీని వాస్‌పై ప్రశంసల జల్లు కురిసింది. సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, గతంలో వేములవాడ ఎమ్మెల్యేను కలవాలంటే జర్మని వెళ్లాల్సి వచ్చేదని కానీ, ఈ ప్రభుత్వంలో ఆది వేములవాడ ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల వద్దకు స్వయంగా వెళ్తున్నారని ప్రశంసించారు. అసెంబ్లీ సమావేశాలు మినహా ఏనాడు హైదరాబాద్‌ రాడని, నియోజకవర్గ అభివృద్ధి తప్ప పైరవీలు చేయడని స్పష్టం చేశారు. ఇలాంటి ఎమ్మెల్యేలు తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నా రు. అలాగే వేములవాడలో ఆలయ విస్తరణ, సాగునీటి పనుల పూర్తికి ప్రభుత్వం తీసుకుంటున్న చొర వ ఆది శ్రీనివాస్‌ కృషి అని మంత్రులు పొంగులేటి, ఉత్తమ్‌, పొన్నం, శ్రీధర్‌బాబు అభినందించారు.

సీఎంకు విప్‌ ఆది శ్రీనివాస్‌,

ఆయన కుమారుడు కార్తీక్‌ తలపాగా ధరింపజేసి స్వామివారి చిత్రపటం, త్రిశూలం బహూకరించారు.

2.55 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగాన్ని ప్రారంభించి 3.30 గంటలకు ముగించారు.

సభా వేదికపైనుంచి కిందకు దిగిన సీఎంతో పోలీసు ఉన్నతాధికారులు ఫొటో దిగారు.

3.45 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి హెలీకాప్టర్‌ ద్వారా తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.

– వేములవాడ

11.41 గంటలకు ఆలయ విస్తరణ పనులకు భూమిపూజ చేశారు. మంత్రులందరికీ ప్రభుత్వవిప్‌ ఆది శ్రీనివాస్‌ కొబ్బరికాయలు అందజేశారు. కార్యక్రమానికి శృంగేరి అర్చకులు హాజరయ్యారు.

11.45 గంటలకు ప్రారంభోత్సవాలు చేసిన సీఎం. 11.55 గంటలకు ఆలయంలోకి ప్రవేశించి మంత్రులతో కలిసి 12.20 వరకు దర్శనాలు పూర్తిచేసుకున్నారు.

12.25 గంటలకు స్వామివారి అద్దాల మంటపంలో సీఎం, మంత్రులకు దేవాదాయశాఖ అధికారులు, ప్రభుత్వవిప్‌ ప్రసాదాలు అందజేశారు. ఆలయ అర్చుకులు

ఆశీర్వచనం గావించారు. అనంతరం సీఎంతో ఫొటో దిగారు.

12.45 గంటలకు దర్శనాలు పూర్తిచేసుకుని గెస్ట్‌హౌస్‌కు

చేరుకున్నారు.

మధ్యాహ్నం 1.20 గంటలకు ప్రారంభోత్సవాలు పూర్తి చేసి, 1.25 గంటలకు సీఎం వేదికపైకి చేరుకున్నారు.

1.35 గంటలకు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం తెలంగాణ గీతం ఆలపించారు.

1.40 గంటలకు యార్నడిప్‌ వర్చువల్‌గా సీఎం ప్రారంభించారు. 1.45 గంటలకు ప్రభుత్వవిప్‌ ఆది శ్రీనివాస్‌ స్వాగత వచనాలు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
పూర్తి చేస్తాం1
1/8

పూర్తి చేస్తాం

పూర్తి చేస్తాం2
2/8

పూర్తి చేస్తాం

పూర్తి చేస్తాం3
3/8

పూర్తి చేస్తాం

పూర్తి చేస్తాం4
4/8

పూర్తి చేస్తాం

పూర్తి చేస్తాం5
5/8

పూర్తి చేస్తాం

పూర్తి చేస్తాం6
6/8

పూర్తి చేస్తాం

పూర్తి చేస్తాం7
7/8

పూర్తి చేస్తాం

పూర్తి చేస్తాం8
8/8

పూర్తి చేస్తాం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement