రాష్ట్రస్థాయి పోటీల్లో కండ్లపల్లి విద్యార్థుల ప్రతిభ
జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లి మోడల్‌స్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో ప్రతిభ కనబర్చినట్లు పీడీ వినీత్, అజీమ్ తెలిపారు. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన అండర్ –19 ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాస్కెట్‌బాల్ జట్టులో మోడల్‌స్కూల్ విద్యార్థులు పాల్గొని అత్యంత ప్రతిభ కనబర్చారు. వారిని బుధవారం ప్రిన్సిపాల్ సరితాదేవి అభినందించారు. వైస్ ప్రిన్సిపాల్ నగేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు 25మంది ఎంపిక
మెట్‌పల్లి: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని మినీ స్టేడియంలో బుధవారం జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ రాణవేని సుజాత జెండా ఊపి ప్రారంభించారు. పోటీలకు వెయ్యి మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ప్రతిభ చూపిన 25మందిని వచ్చే నెల ఒకటిన మంచిర్యాలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. వీరికి చైర్‌పర్సన్ చేతులమీదుగా సర్టిఫికెట్లు, మెడల్స్ అందించారు. నైపుణ్యం పెంచడానికి క్రీడలు దోహాదపడుతాయన్నారు. అసోసియేషన్ కార్యదర్శి ఏలేటి ముత్తయ్యరెడ్డి, ఉపాధ్యక్షులు రాందాస్, కొమురయ్య, ఆల్‌రౌండర్ గంగాధర్ తదితరులున్నారు.
25న బీసీ సమరభేరి సభ
జగిత్యాలటౌన్: ఈనెల 25న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో బీసీల సమరభేరి సభ నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేశ్ తెలిపారు. జిల్లా కేంద్రంలో బుధవారం సమరభేరి పోస్టర్‌ను ఆవిష్కరించారు. కేంద్రంలో వెనుకబడిత తరగతుల మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని, చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ముసిపట్ల లక్ష్మీనారాయణ, టి.నందగోపాల్, చిగుర్ల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవారి లత, నాయకులు కొక్కు గంగాధర్, తిరుపురం రాంచంద్రం, దండుగుల వంశీ, బండపెల్లి మల్లేశ్వరి, రాపర్తి రవి, కోటగిరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలి
మెట్‌పల్లి: హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతిఒక్కరు కృషి చేయాలని జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతిస్వామి అన్నారు. పట్టణంలోని శివభక్త మార్కండేయ ఆలయ పునర్నిర్మాణ పనులకు బుధవారం ఆయన చేతులమీదుగా భూమిపూజ నిర్వహించారు. చిన్నతనం నుంచే పిల్లల్లో భక్తిభావం పెంపొందేలా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, పద్మశాలీ సంఘం పట్టణాధ్యక్షులు ధ్యావన్‌పల్లి రాజారాం, సంకు ఆనంద్, గుంటుక గౌతమ్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment