తిట్లకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్‌రెడ్డి
జగిత్యాల: తిట్లకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్‌రెడ్డి అని, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చని ముఖ్యమంత్రి అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు అన్నారు. బుధవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను తర్వాత చేయొచ్చుగానీ.. మహిళలకు ఇస్తామన్న రూ.2500, తులం బంగారం ముందుగా ఇవ్వాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎల్.రమణ మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో అనేక పథకాలు తెచ్చారని, దేశం దృష్టిని ఆకర్షించేలా అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. ఇచ్చిన ఆరు హామీలను అమలుచేసే శక్తి లేకనే కేసీఆర్‌ను దూషిస్తున్నారని తెలిపారు. దూషణలు మానుకుని ప్రజలకు సుపరిపాలన అందించాలని సూచించారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ను ప్రజల గుండెల్లోంచి తొలగించడం ఎవరివల్లా కాదన్నారు. కేసీఆర్ ఒక మహావృక్షమన్నారు. మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి వరంగల్ సభలో కేసీఆర్‌ను అసభ్యపదజాలంతో దూషించడాన్ని ఖండించారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు రాంమోహన్‌రావు, కొల్ముల రమణ పాల్గొన్నారు.
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు
Comments
Please login to add a commentAdd a comment