కొండగట్టులో సామూహిక కార్తీక దీపోత్సవం
కొండగట్టు(చొప్పదండి): కార్తీకమాసం సందర్భంగా కొండగట్టు అంజన్న ఆలయంలోని అభిషేక మండపంలో మంగళవారం అర్చకులు, అధికారులు హనుమాన్ చిత్రపటానికి పూ జలు నిర్వహించారు. దీపాలు వెలిగించారు. కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు ఉపాధ్యాయుల చంద్రశేఖర్, ఆలయ పరిశీలకులు చెక్కిళ్ల అశోక్, వేద పండితులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
గోదావరిలో పారిశుధ్య పనులు
ధర్మపురి: ధర్మపురి గోదావరిలో మంగళవారం పారిశుధ్య పనులు ముమ్మరం చేశారు. ము న్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు కార్తీకమాసం సందర్భంగా వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా గోదావరిలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించారు. అపరిశుభ్రంగా ఉన్న చోట ఈగలు, దోమలు చేరకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లారు. శానిటరీ ఇన్స్‌పెక్టర్ గంగాధర్, సిబ్బంది తదితరులున్నారు.
రైతులకు ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలి
జగిత్యాలరూరల్: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు వెంటనే డబ్బులు చెల్లించాలని జిల్లా సెర్ప్ ఫైనాన్స్ డీపీఎం విజయభారతి అన్నారు. జగిత్యాల అర్బన్ మండలం ధరూర్, అంబారిపేట, తిప్పన్నపేట, గోపాల్‌రావుపేట, రూరల్‌మండలం అంతర్గాం, తాటిపల్లిలోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. మిల్లుల్లో ధాన్యం అన్‌లోడ్ కా గానే ట్రక్‌షీట్ తెప్పించుకుని ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయాలన్నారు. రూరల్ మండలంలోని 18 కేంద్రాల ద్వారా 738 మంది రైతుల నుంచి 39, 040 క్వింటాళ్లు, అర్బన్ మండలంలోని ఐదు కేంద్రాల ద్వారా 200 మంది రైతుల నుంచి 11,058 క్వింటాళ్ల ధాన్యం సేకరించినట్లు తెలి పారు. ఏపీఎం గంగాధర్, పరిశీలన అధికారులు నాగరాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
క్రిస్మస్ సందడి షురూ
జగిత్యాలటౌన్: జిల్లాలో క్రిస్మస్ సందడి మొదలైంది. జిల్లాకేంద్రంలోని మిషన్‌కాంపౌండ్‌లోని సీఎస్‌ఐ వెస్లీ చర్చిలో సపోస్ వేడుకలు నిర్వహించారు. ఫాస్ట్రేట్ చైర్మన్, ఆలయ గురువు రై టరెవ జీవరత్నం ఆధ్వర్యంలో ఏసు జన్మవృత్తాంతానికి సంబంధించిన నాటికను విద్యార్థులు ప్రదర్శించారు. క్రైస్తవులు పాల్గొన్నారు.
‘ఉపాధ్యాయులను బాధ్యులను చేయొద్దు’
జగిత్యాల: మధ్యాహ్న భోజన నిర్వహణ సక్రమంగా లేదంటూ ఉపాధ్యాయులను బాధ్యులను చేసి సస్పెండ్ చేయడం సరికాదని ఉపాధ్యాయ సంఘం నాయకులు డీఈవోకు వినతిపత్రం సమర్పించారు. బిల్లులు సరిగా రాకపోవడం.. గుడ్డు ధర పెరగడంతో మెనూలో కొంత తారతమ్యాలు ఉన్నాయని, వంట నిర్వాహకులపై కాకుండా ఇన్‌చార్జి ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. ప్రధానోపాధ్యాయులు మధ్యాహ్న భోజన ఏజెన్సీలతో సమావేశం కావాలని, పాఠశాలల్లో వంటల కోసం సదుపాయాలు కల్పించాలని, లోపం ఎక్కడుందో కనిపెట్టాలని సూచించారు. ఉపాధ్యాయ సంఘ నాయకులు మచ్చ శంకర్, తుంగూరి సురేశ్, బోనగిరి దేవయ్య, కొక్కుల రాంచంద్రం, ఒడ్నాల రాజశేఖర్, నరేందర్‌రావు, అమర్‌నాథ్‌రెడ్డి, ఆనందరావు, రఘుపతియాదవ్, హరికిరణ్, బోగ రమేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment