ధాన్యం కొనుగోళ్లు సమర్థవంతంగా చేపట్టాలి
జగిత్యాల: ధాన్యం కొనుగోళ్లను సమర్థవంతంగా చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. సన్నాలకు రూ.500 బోనస్ అందించాలని, కొనుగోళ్లలో అక్రమాలు జరగకుండా పర్యవేక్షించాలని పేర్కొన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా తాగునీరు, ఇతక వసతులు కల్పించాలన్నారు. త్వరలోనే రేషన్‌కార్డుదారులు, వసతిగృహాలు, గురుకులాలకు సన్నబియ్యం అందిస్తామన్నారు. ఈనెల 30న రైతు పండుగ విజయోత్సవంలోపు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్లు బీఎస్.లత, గౌతమ్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
1,68,695 టన్నుల ధాన్యం కొనుగోలు
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ఇప్పటివరకు 430 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,68,695 టన్నుల ధాన్యాన్ని 29,229 మంది రైతుల ద్వారా సేకరించామని కలెక్టర్ తెలిపారు. రూ.391.37కోట్లకు రైతుల ఖాతాల్లో రూ.301.89 కోట్లు జమ చేశామన్నారు. సన్నరకం ధాన్యానికి సంబంధించి రూ.1.79 కోట్లు అందించామన్నారు.
భోజనంలో నాణ్యత లోపించొద్దు
మెట్‌పల్లిరూరల్: విద్యార్థులకు అందించే భోజనం విషయంలో నాణ్యత లోపించొద్దని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. పట్టణ శివారు ఆరపేట సాంఘిక సంక్షేమ బాలికల గురుకులాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని, పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ మోహన్, తహసీల్దార్ శ్రీనివాస్, ఇన్‌చార్జి ఉపాధ్యాయురాలు ప్రేమలత పాల్గొన్నారు.
ఈవీఎం ట్యాంపరింగ్ అసాధ్యం
జగిత్యాల: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ట్యాంపరింగ్ అసాధ్యమని సుప్రీంకోర్టు తెలిపినట్లు కలెక్టర్ తెలిపారు. ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించాలన్న ప్రజాహిత వ్యాజ్య పిటిషన్లకు సమాధానం ఇస్తూ అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసిందన్నారు.
● కలెక్టర్‌ను ఆదేశించిన సీఎం
Comments
Please login to add a commentAdd a comment