రైతు వ్యతిరేక బడ్జెట్‌ను సవరించాలి
● కార్మిక, రైతు కూలీ సంఘాల డిమాండ్
జగిత్యాలటౌన్: కేంద్రప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్య తిరేక విధానాలకు పాల్పడుతోందని, దేశ వనరులను కార్పొరేట్లకు దోచిపెడుతోందని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ 10 జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు మంగళవారం జిల్లాకేంద్రంలో నిరసన చేపట్టారు. మోదీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వరంగ సంస్థలను స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు కారుచౌకగా తెగనమ్ముతోందని విమర్శించారు. ఉపాధి హామీలో కోత పెడు తూ కూలీలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కార్మికవర్గానికి గుది బండగా మారిన నాలుగు లేబర్ కోడ్‌లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు, ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి చింత భూమేశ్వర్, ఏఐఎఫ్‌టీ యూ నాయకురాలు ఎన్.లక్ష్మి, టీయూసీఐ నాయకులు ఆరెల్లి భీమయ్య, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment