● సామాన్య ప్రయాణికులకు అదనపు సదుపాయం ● దాదాపు 10 రైళ్లల
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
ఉమ్మడి కరీంనగర్ రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ముఖ్యంగా ఉత్తరాదికి వెళ్లేవారికి కేంద్రం తీపికబురు తీసుకొచ్చింది. ఇంతకాలం ప్రతీ ఎక్స్‌ప్రెస్‌లో ఉండే రెండు జనరల్ కోచ్‌లతో సాధారణ ప్రయాణికులు ఇబ్బంది పడేవారు. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు తాజాగా పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అదనంగా రెండు కోచ్‌లు జత చేస్తూ రైల్వే నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి జంక్షన్, రామగుండం, జమ్మికుంట రైల్వే స్టేషన్ల నుంచి దూరప్రాంత ప్రయాణికులకు ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుంది. సాధారణ బోగీల్లో ప్రయాణం చేసేవారికి ముఖ్యంగా వలస కార్మికులకు, దినసరి కూలీలకు, విద్యార్థులకు ఊరట కలిగించే విషయం. ఉన్న రెండు జనరల్ కోచ్‌లలో కిక్కిరిసి, వేలాడుతూ వందల కిలోమీటర్లు ప్రయాణించే బాధలు సగం వరకు తగ్గనున్నాయి. మహిళలు సైతం మరుగుదొడ్ల వద్ద నిల్చుని, న్యూస్‌పేపర్ వేసుకుని కింద కూర్చునే బాధలకు కాస్త ఉపశమనం దొరకనుంది.
నేపథ్యం ఇదీ..
దేశవ్యాప్తంగా నడుస్తున్న 800 ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లలో ప్రస్తుతం రెండు సాధారణ బోగీలు ఉండడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఈ విధానం మారాలంటూ రైల్వే మంత్రికి అనేక ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఈ సమస్య పరిష్కరించేందుకు మరోరెండు సాధారణ బోగీలు జత చేసి శాశ్వత ప్రాతిపదికన నడుపుతామని జూన్‌లో ప్రకటించారు. వీటిని ఈ నెల నుంచి వచ్చే నెల మధ్య వరకు దశలవారీగా అన్ని రైళ్లలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దక్షిణ మధ్య పరిధిలోని, ముఖ్యంగా కాజీపేట నుండి బల్లార్షా సెక్షన్‌కు సంబంధించిన దూర ప్రాంత రైళ్లలో మన జోన్‌కి ఇతర జోన్లకు చెందిన రైళ్లలో కొన్నింటిలో ఏర్పాటుచేశారు. దీంతో ఈ అదనపు కోచ్‌లు ఉమ్మడి జిల్లా నుంచి ఉత్తరాది కి ప్రయాణించే పేద ప్రయాణికులు, వలస కూలీలు, విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం కానుంది.
పేద ప్రయాణికులకు ఉపశమనం
దూర ప్రాంతాల ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్‌రైళ్లకు అదనంగా రెండు బోగీలు జత చేయడంతో సామాన్య ప్రయాణికులకు ముఖ్యంగా బీహార్, ఉత్తర్ ప్రదేశ్ , ఝా ర్ఖండ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులకు ఉపశమనం కలుగుతుంది, ఇన్ని రోజులు దానాపూర్ వెళ్లే రైళ్లలో రెండే సాధారణ బోగీలు ఉండే సరికి సాఽ దారణ ప్రయాణికులు మరుగుదొడ్ల దగ్గర నిల్చొని, వేలాడుతూ భయంకరమైన ప్రయాణం సాగించేవారు. తాజా నిర్ణయంతో ఈ బాధలు చాలా వరకు తగ్గనున్నాయి.
– అక్షిత్ ఫణి, ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment