వామ్మో చలి..
● జిల్లాలో పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు
● 10.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు
● బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్న జనం
● వాతావరణ మార్పులే కారణమంటున్న శాస్త్రవేత్తలు
చలి తీవ్రత పెరిగే అవకాశం
జిల్లాలో మరికొద్ది రోజుల పాటు చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు అక్కడక్కడ తగ్గుతుండటం, వరి నారు మళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు అదే స్థాయిలోనే ఉండే అవకాశం ఉంది.
– డాక్టర్ శ్రీనివాస్, పరిశోధన స్థానం డైరెక్టర్
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో చలి భయపెడుతోంది. ఈ యేడు అధిక వర్షాలు కురవడం.. భూగర్భజలాలు ౖపైపెనే ఉండటంతో భూమిలో తేమ శాతం ఎక్కువగా ఉండి చలిగాలులు వీస్తున్నాయి.
ఈ ఏడాది అధికం
గతేడాది చలికాలంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి. కానీ ఈ ఏడాది ఇప్పుడే 10 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. ఉదయం, సాయంత్రం చలి పంజా విసురుతోంది. దీంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. గోదావరి తీర ప్రాంతాలు, అటవీ ప్రాంతాలైన మల్లాపూర్, ధర్మపురి, సారంగాపూర్ మండలాల్లో ఎన్నడూ లేనంతగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పొలాస వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం రానున్న ఐదు రోజుల్లో వాతావరణం పొడిగా ఉండటంతోపాటు గరిష్ట ఉష్ణోగ్రతలు 28 నుంచి 29 డిగ్రీల సెల్సియస్‌గా, కనిష్ట ఉష్ణోగ్రతలు 15 నుంచి 17 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.
జాగ్రత్తలు తప్పనిసరి
శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు ఉదయం, సాయంత్రం వేళల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వాయు కాలుష్యం అధికమవుతున్న నేపథ్యంలో బయటకు వెళ్లినప్పుడు మా స్క్‌లు ధరించాలంటున్నారు. వాహనాలపై వెళ్తున్నవారు స్వెట్టర్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా..
మల్లాపూర్ మండల కేంద్రంలో బుధవారం కనిష్ట ఉష్ణోగ్రత 10.7 డిగ్రీల సెల్సియస్‌గా.. రాఘవపేట లో 10.8, భీమారం మండలం గోవిందారంలో 10.9, మన్నెగూడెంలో 11.2, ఎండపల్లి మండలం గుల్లకోటలో 11.2, కథలాపూర్‌లో 11.3, మెట్‌పల్లి లో 11.6, పెగడపల్లిలో 11.7, ఇబ్రహీంపట్నం మండలం గోదూర్, మల్యాల మండలం మద్దుట్ల, సారంగపూర్‌లో 11.8, ధర్మపురి మండలం నేరెళ్ల, మేడిపల్లి, రాయికల్, కోరుట్ల మండలం అయిలా పూర్‌లో 11.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment