స్వామివారల సేవలో విప్, ఎమ్మెల్యే
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామిని సోమవారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేశ్ దర్శించుకున్నారు. అలాగే విప్ అడ్లూరి లక్ష్మ ణ్‌కుమార్ స్థానిక శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయం పక్షాన సాధారణ రీతిలో స్వాగతం పలికారు. ఈవో శ్రీనివాస్ స్వామివారి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదం అందజేశారు. సీనియర్ అసిస్టెంట్ అలువాలు శ్రీనివాస్, అర్చకులు నంబి శ్రీనివాస్, సిబ్బంది తదితరులున్నారు.
ధర్మపురికి చేరిన శ్రీరామ పాదుకలు
ధర్మపురి: అయ్యోధ శ్రీరామచంద్రుల బంగారు పాదుకలు సోమవారం ధర్మపురికి చేరుకున్నాయి. పాదుకలను ముందుగా దేవస్థానం ఆధ్వర్యంలో పట్టణంలోని నందీ కూడలి నుంచి స్వామివారి ఆలయం వరకు మేళతాళాలు, మంగళవాయిద్యాలతో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం దేవాలయంలో పాదుకలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భాగ్యనగరం సంగెం రాంటెంకి నుంచి తీసుకొచ్చిన బంగారు పాదుకలకు భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. రామరాజ్యం ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు దేవేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, చిలుకూరి బాలాజీ శివాలయం అర్చకులు సురేష్ మహారాజ్, నృసింహస్వామి ఆలయ ఈవో శ్రీనివాస్, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో..
సారంగాపూర్(జగిత్యాల): బీర్‌పూర్ శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయానికి సోమవారం శ్రీరా ముని బంగారు పాదుకలు చేరుకున్నాయి. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి పాదుకులను భక్తులు దర్శించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment