అయ్యప్ప పడిపూజ
రాయికల్(జగిత్యాల): మండలంలోని మైతాపూర్‌లో సోమవారం రాత్రి హనుమాన్ ఆలయ పరిసరాల్లో దీక్షాపరులు, గ్రామస్తులు అయ్యప్ప పడిపూజ వైభవంగా నిర్వహించారు. అర్చకులు మునుగోటి సత్యనారాయణ, సాయి సుధీర్‌శర్మ ప్రత్యేక పూజలు చేశారు.
పట్టుదలతో చదవాలి
జగిత్యాల: పట్టుదల ఉంటే విద్యార్థులు ఏదైనా సాధించవచ్చని డీఈవో రాము అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి జాతీయ గణితం టాలెంట్ పరీక్షలో ఖాజీపుర విద్యార్థి ఫాతిమ మూడో స్థానంలో నిలువగా, నగదు రూ.2 వేలతో పాటు, బహుమతి అందజేశారు. హెచ్‌ఎం ఎంఏ రహీం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment