రికార్డుల్లో నమోదు కాలేదు
భూషణరావుపేట శివారులోని సర్వే నంబర్ 457లో 37 గుంటల భూమిని ఏళ్లుగా మా తండ్రి, తర్వాత నేను సాగు చేస్తున్న. సాదాబైనామాలో పలుమార్లు దరఖాస్తు చేసినం. ఇప్పటికీ రికార్డుల్లో నమోదు కాలేదు. భూమి నా పేరున లేక పథకాలు అందడంలేదు. భూ భారతి చట్టంలోనైనా నా సమస్య పరిష్కరించాలి.
– గుగ్లొత్ రవినాయక్, రైతు, భూషణరావుపేట, కథలాపూర్
ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తాం
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా భూ భారతి కార్యక్రమాన్ని రూపొందించింది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉంది. సాదాబైనామా విషయంలోనూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సమస్యలు పరిష్కరిస్తాం. భూ సమస్యలపై రైతులు దరఖాస్తు చేసుకుంటే నిబంధనల ప్రకారం పరిష్కరిస్తున్నాం.
– జివాకర్‌రెడ్డి, ఆర్డీవో, కోరుట్ల
Comments
Please login to add a commentAdd a comment