మోడల్ స్కూల్ పిలుస్తోంది
● 6 నుంచి 10వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం ● ఏప్రిల్ 13న పరీక్ష, మే నెలలో ఫలితాలు
మల్లాపూర్(కోరుట్ల): విద్యార్థులకు కార్పొరేట్ తరహాలో ఆంగ్ల మాధ్యమంలో విద్యనందించడానికి ప్రభుత్వం మోడల్ స్కూళ్లను ప్రారంభించింది. మోడల్ స్కూళ్లల్లో 6వ తరగతిలో ప్రతి సంవత్సరం 100 సీట్లకు ప్రవేశాలు కల్పిస్తుండగా, 7–10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను నింపుతున్నారు. ఇంటర్మీడియేట్ కోసం 10వ తరగతి వచ్చిన గ్రేడ్ పాయింట్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తున్నారు. 6వ తరగతి అడ్మిషన్ల కోసం ఈ నెల 23న షెడ్యూల్ విడుదల చేయనుండగా, జనవరి 6 నుంచి 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఏప్రిల్ 13న ప్రవేశ పరీక్ష ఉంటుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఆరో తరగతి విద్యార్థులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, 7 నుంచి 10వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. మే రెండో వారంలో ఫలితాలను విడుదల చేస్తారు.
సద్వినియోగం చేసుకోవాలి
ఆదర్శ పాఠశాలలో ప్రవేశ పరీక్షను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. పేద విద్యార్థులకు మంచి అవకాశం. ఆదర్శ పాఠశాలలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉండడంతో నాణ్యమైన విద్య లభిస్తోంది.
– రాము, డీఈవో
జిల్లాలో..
మోడల్ స్కూళ్లు 13
విద్యార్థుల సంఖ్య 9,330
బాలురు 4,260
బాలికలు 5,070
Comments
Please login to add a commentAdd a comment