చివరి భూములకు ఎస్సారెస్పీ నీరు అందాలి
జగిత్యాలఅగ్రికల్చర్/సారంగాపూర్: ఎస్సారెస్పీ నీటిని చివరి ఆయకట్టుకు అందించాలని కలెక్టర్ సత్యప్రసాద్ ప్రాజెక్టు అధికారులను అదేశించారు. కాలువల అధ్వాన స్థితిపై ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనానికి స్పందించిన ఆయన ప్రాజెక్టు అధికారులతో కలిసి జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి వద్దగల డి–53, సారంగాపూర్ మండలం రేచపల్లి వద్ద 12ఎల్1ఆర్, రంగపేట వద్ద 12ఎల్ ప్రధాన, డిస్ట్రిబ్యూటరీ కాలువలను పరిశీలించారు. డి–53 కెనాల్‌లో దెబ్బతిన్న డ్రాఫ్ట్ మరమ్మతు పనులకు అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రేచపల్లి, రంగపేట కాలువల్లో పూడికతీతకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. రేచపల్లి కెనాల్ ద్వారా సారంగాపూర్, బీర్‌పూర్ మండలాలకు నీరు అందించాలని సూచించారు. రంగపేట కెనాల్ ద్వారా రోళ్లవాగు ప్రాజెక్టుకు నీరు చేరుతుందని, కాలువల్లో చెత్తాచెదారం లేకుండా చూడాలని ఆదేశించారు. రేచపల్లి, సారంగాపూర్, బట్టపల్లి, పోతారం గ్రామాల్లోని కాలువలోగల ముళ్లపొదలు, పిచ్చిమొక్కలను ఉపాధి హామీ పథకంలో చేర్చి పనులు పూర్తి చేయాలని తెలిపారు. ఆయన వెంట ఆర్డీవో మధుసూదన్, డీఆర్‌డీవో రఘువరన్, నీటిపారుదల శాఖ డీఈ చక్రూనాయక్, తహసీల్దార్ జమీర్, ఎంపీడీవో గంగాధర్, ఏపీవో లత, ఏఈ అనిల్, వర్క్ ఇన్‌స్పెక్టర్ మోహన్, రైతులు, నాయకులు ఉన్నారు.
● కాలువలను పరిశీలించిన కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment