![ధాన్య](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10jgl81-180032_mr-1739214873-0.jpg.webp?itok=xaAX97EP)
ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి
జగిత్యాల: యాసంగికి సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు పారదర్శంగా చేపట్టాలని, రైతులకు ఇబ్బందులు రానీయొద్దని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై సోమవారం వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టరేట్‌లో స మీక్షించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వొద్దని సూచించారు. అకాల వ ర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకుని రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లత, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.
బాధితులకు సత్వర న్యాయం చేయాలి
జగిత్యాలక్రైం: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 11 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో ఎస్పీ నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
ప్రకృతి విపత్తులను ఎదుర్కోవాలి
మల్లాపూర్: ప్రకృతి మార్పులతో సంభవించే విపత్తులను అప్రమత్తంగా ఎదుర్కోవాలని జాతీయ విపత్తు నిర్వహణ దళం పదో బెటాలియన్ కమాండర్ వీవీఎన్.ప్రసన్నకుమార్ అన్నారు. మండలకేంద్రంలోని రైతువేదికలో ఎన్డీఆర్‌ఎఫ్ ఆధ్వర్యంలో విపత్తుల నివారణపై అవగాహన కల్పించారు. మానవ తప్పిదాలు, ప్రకృతి మార్పులతో విపత్తులు వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణ, ఆస్తినష్టాన్ని నివారించవచ్చన్నారు. భూకంపం, వరదలు, అగ్నిప్రమాదాలు, పాముకాటు, అకస్మాత్తుగా సృహ కోల్పోవడం వంటివి ఎదుర్కొనే వ్యూహాలను ప్రదర్శనల ద్వారా వివరించారు. తహసీల్దార్ వీర్‌సింగ్, ఎస్సై రాజు, ఆర్‌ఐ సురేష్, జాతీయ విపత్తుల నిర్వహణ దళం టీం కమాండర్ ఇన్స్‌పెక్టర్ ముఖేష్‌కుమార్, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.
పద్మశాలీలు ఐక్యంగా
ఉండాలి
జగిత్యాల: పద్మశాలీలందరూ ఐక్యంగా ఉండి సమస్యలు పరిష్కరించుకోవాలని మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి అన్నారు. పద్మశాలీలు రూపొందించిన డైరీ, క్యాలెండర్‌ను సోమవారం ఆవిష్కరించారు. కుల పటిష్ఠతకు ఐక్యంగా ఉండి పోరాటం చేయాలని కోరారు. కార్యక్రమంలో జగిత్యాల జిల్లా పోపా అధ్యక్షుడు కొక్కుల రాజేశ్, గోవర్దన్, రాజు, రమేశ్, రాజ్‌కుమార్, డీఆర్డీవో రఘువరణ్, రాష్ట్ర నాయకులు బోగ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
![ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి1](https://www.sakshi.com/gallery_images/2025/02/11/10jgl54-180019_mr-1739214874-1.jpg)
ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి
![ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి2](https://www.sakshi.com/gallery_images/2025/02/11/10krt85-180038_mr-1739214874-2.jpg)
ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి
Comments
Please login to add a commentAdd a comment