![పత్తి కొనాలని రైతుల ధర్నా](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11dmp101-180137_mr-1739299918-0.jpg.webp?itok=-oSkzX-W)
పత్తి కొనాలని రైతుల ధర్నా
వెల్గటూర్: పత్తి కొనుగోళ్లు చేపట్టాలని
డిమాండ్ చేస్తూ ఎండపల్లి మండలం కొత్తపేట శాతవాహన జిన్నింగ్ మిల్లు ఎదుట.. ఏడో నంబర్ రాష్ట్ర రహదారిపై మంగళవారం అన్నదాతలు ధర్నాకు దిగారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన తాము రెండు రోజులుగా పడిగాపులు కాస్తున్నామని, సాంకేతిక లోపం తలెత్తిందంటూ కొనుగోళ్లు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి రైతులను సముదాయించారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఆధార్ సైట్‌లో సాంకేతిక లోపంతో కొనుగోళ్లు నిలిచిపోయాయని, సమస్య పరిష్కారం కాగానే కొనుగోళ్లు చేస్తామని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment