![‘నవోదయ’ను తరలించకండి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11dmp01-180085_mr-1739299918-0.jpg.webp?itok=ZC_P0fdM)
‘నవోదయ’ను తరలించకండి
ధర్మపురి: ధర్మపురి నియోజకవర్గంలోని నేరెల్ల గ్రామానికి మంజూరైన నవోదయ కేంద్రీయ విద్యాలయాన్ని ఇతర ప్రాంతానికి తరలించొద్దని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు విన్నవించారు. ఢిల్లీలో ఆయనను కలిసి వినతిపత్రం అందించారు. నవోదయ పాఠశాల కోసం ఇప్పటికే నేరేళ్లలో సర్వేనంబర్ 252లో 30ఎకరాలు గుర్తించి కేంద్రానికి నివేదిక పంపించామని, అయితే నిజామాబాద్ ఎంపీ అర్వింద్ నవోదయను ఇతర ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. నేరెళ్లకు మంజూరైన నవోదయను యధావిధిగా ఉంచేలా అధికారులను ఆదేశించాలని కోరారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారని అడ్లూరి ‘సాక్షి’కి తెలిపారు. విప్ వెంట ఎంపీ గడ్డం వంశీ, తదితరులున్నారు.
● కేంద్రమంత్రికి అడ్లూరి వినతి
Comments
Please login to add a commentAdd a comment