● పోలీసుల నిఘా తీవ్రం ● అయినా ఆగని వైనం ● చేతులు మారుతు
జగిత్యాలక్రైం: జిల్లాలో జూదం జోరుగా సాగుతోంది. కొద్దిరోజులుగా పోలీసులు నిఘా పటిష్టం చేసి రోజుకో చోట పేకాటరాయుళ్లను, కోడి పందేలా ఆడేవారిని రెస్ట్ చేస్తున్నారు. అయినా జూదానికి అడ్డుకట్ట పడటం లేదు. మామిడితోటలు, ఫామ్‌హౌస్‌లు, అడవులు పేకాటరాయుళ్లకు అడ్డాగా మారాయి. కొందరు నిర్వాహకులు ఇతర జిల్లాల జూదరులు, స్థానికులను మచ్చిక చేసుకుని విందు, వసతులు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పేకాట నిర్వహిస్తున్నారు. స్థావరాల వద్ద కాపలా ఏర్పాటు చేసుకుని పోలీసులు రాగానే అక్కడి నుంచి పారిపోతున్నారు. జిల్లాకు చెందిన కొంత మంది మహారాష్ట్రలోని అప్పారావుపేట, బోరి, బిరేళీ వంటి ప్రాంతాలకు వెళ్లి పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నారు.
నిఘా పెంచిన పోలీసులు
జిల్లా వ్యాప్తంగా సీసీఎస్ పోలీసులు పేకాటపై ప్రత్యేక దృష్టి సారించారు. పేకాట ఆడుతున్న సమయంలో పోలీసులు దాడులు చేయగా, చాలా మంది జూదరులు పారిపోతున్నారు. కాగా, దొరికిన వారినుంచి కూపీ లాగి అసలు నిందితులను గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు.
ఈ ఏడాది జనవరి 4న ఎండపల్లి మండలం గుల్లకోట శివారులో కోడిపందెం ఆడుతున్న 10 మందిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని, 3 పందెం కోళ్లు, రూ.4,750 స్వాధీనం చేసుకున్నారు.
జనవరి 7న మల్లాపూర్ మండలం సాతారం శివారులో ఆరుగురిని అదుపులోకి తీసుకుని, రూ.4.15 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
జనవరి 12న మేడిపల్లి మండలం తొంబారావుపేట శివారులో పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసి, రూ.40,500 స్వాధీనం చేసుకున్నారు.
జనవరి 12న ధర్మపురి మండలం రాయపట్నంలో కోడిపందెం ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని కోడిపుంజులు, రూ.10,500 స్వాధీనం చేసుకున్నారు.
జనవరి 18న మేడిపల్లి మండలం రంగాపూర్ శివారులో ఆరుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసి రూ.13,820 స్వాధీనం చేసుకున్నారు.
జనవరి 24న కోరుట్ల మండలం అయిలాపూర్ శివారులో పేకాట స్థావరంపై దాడి చేసి 9 మందిని అరెస్ట్ చేశారు. రూ.24 వేలు స్వాధీనం చేసుకున్నారు.
పేకాటపై ప్రత్యేక నిఘా
జిల్లాలో పేకాటను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నం. చాలా మందిపై కేసులు నమోదు చేసి, కోర్టులో హాజరుపర్చాం. పేకాటతో చాలా కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ప్రతీ పోలీస్‌స్టేషన్ పరిధిలో పేకాటకు అడ్డుకట్ట వేసేందుకు నిఘా పెట్టాం. – అశోక్‌కుమార్, ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment