అభివృద్ధిపై బీఆర్‌ఎస్ మాటలు హాస్యాస్పదం
జగిత్యాలటౌన్: నియోజకవర్గ అభివృద్ధిపై బీఆర్‌ఎస్ నాయకుల మాటలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ తమ ఘనతగా చెప్పుకుంటున్న నూకపల్లిలోని 4వేల ఇళ్లకు బీజం పడింది కాంగ్రెస్ హయాంలోనేనని గుర్తు చేశారు. జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్‌లో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. 2009లోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వంద ఎకరాల భూమిని కొనుగోలు చేసిందన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక వివిధ దశల్లో ఉన్న ఇళ్లను కూల్చి వేసి డబుల్ బెడ్‌రూం ఇళ్లుగా పేరు మార్చిందని విమర్శించారు. రోళ్లవాగు ప్రాజెక్టును మరో కాళేశ్వరంగా మార్చారని విమర్శించారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ, రైతుబంధు పెంచి కాంగ్రెస్ తన చిత్తశుద్ధిని చాటుకుందన్నారు. జేఎన్టీయూ, అగ్రికల్చర్ కళాశాల, న్యాక్ సెంటర్, మ్యాంగో మార్కెట్, బైపాస్ రోడ్డు నిర్మాణం తన హయాంలోనే పూర్తయ్యాయన్నారు. మెడికల్ కళాశాల, జిల్లా కేంద్రం ఏర్పాటు తప్ప జగిత్యాల అభివృద్ధికి బీఆర్‌ఎస్ ప్రత్యేకంగా చేసిందేమీలేదన్నారు. సమావేశంలో బండ శంకర్, కల్లెపెల్లి దుర్గయ్య, దేవేందర్‌రెడ్డి, గాజుల రాజేందర్, దర రమేశ్, మసర్తి రమేశ్, లైశెట్టి విజయ్, చందా రాధాకిషన్, బీరం రాజేశ్, ముఖేష్‌ఖన్నా తదితరులు పాల్గొన్నారు.
బాధ్యతలు స్వీకరించిన ఇన్‌చార్జి కమిషనర్
రాయికల్: రాయికల్ మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్‌గా వెంకటి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, పట్టణ ప్రజలు ఎలాంటి సమస్యలున్నా నేరుగా కార్యాలయానికి రావాలని కోరారు. అనంతరం పలువురు మాజీ కౌన్సిలర్లు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
లింగాపూర్‌లో ఎడ్లబండ్ల పోటీలు
పెగడపల్లి: మండలంలోని లింగాపూర్‌లో శ్రీలక్ష్మీ నర్సింహాస్వామి జాతర ఉత్సవాలు మూడురోజులుగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఎడ్లబండ్ల ప్రదర్శన చేపట్టారు. వివిధ మండలాల నుంచి సు మారు 20 ఎడ్లబండ్లు పోటీల్లో పాల్గొన్నాయి. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందించారు. మొదటి బహుమతి ఆర్.మధుకర్ (మేడారం) పావు తులం బంగారం, ద్వితీయ బహుమతి షేక్ భాషూమియా(తిర్మలాపూర్) 10 తులాల వెండి, తృతీయ బహుమతి మాదాసు శంకరయ్య (చెర్లపల్లె) 5 తు లాల వెండి అందుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు పాల్గొన్నారు.
వేసవిలో విద్యుత్ సమస్యలు రానీయం
రాయికల్: రానున్న వేసవిలో విద్యుత్ వినియోగదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ సమస్యలు రాకుండా చూస్తున్నామని, ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తామని విద్యుత్ శాఖ జిల్లా సూపరింటెండెంట్ సాలియ అన్నారు. మంగళవారం రాయికల్ మండలం ఉప్పుమడుగు సబ్‌స్టేషన్‌లో 5 కిలోమీటర్ల మేర నూతన లైన్‌ను ప్రారంభించారు. రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నూతన ఫీడర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. డీఈలు గంగారాం, సంపత్, గోపికృష్ణ, రాజిరెడ్డి, ఏడీఈలు సిందూర్‌శర్మ, రాజబ్రహ్మచారి, ఏఈ రాజేశం పాల్గొన్నారు.
అభివృద్ధిపై బీఆర్‌ఎస్ మాటలు హాస్యాస్పదం
అభివృద్ధిపై బీఆర్‌ఎస్ మాటలు హాస్యాస్పదం
అభివృద్ధిపై బీఆర్‌ఎస్ మాటలు హాస్యాస్పదం
Comments
Please login to add a commentAdd a comment