![● అర్జీలను వెంటవెంటనే పరిష్కరించాలి ● ఎట్టిపరిస్థితుల్ల](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10jgl78-180032_mr-1739214875-0.jpg.webp?itok=z79_lPBd)
● అర్జీలను వెంటవెంటనే పరిష్కరించాలి ● ఎట్టిపరిస్థితుల్ల
జగిత్యాల: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని, పెండింగ్‌లో
ఉంచవద్దని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. వివిధ సమస్యలతో.. వివిధ ప్రాంతాల నుంచి బాధితులు సమస్యల పరిష్కారం కోసం వస్తుంటారని, వాటిని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వివిధ సమస్యలపై 30వరకు అర్జీలు వచ్చాయన్నారు. ఇందులో అత్యధికంగా భూ సమస్యలకు సంబంధించినవే ఉన్నాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లత, ఆర్డీవో మధుసూదన్, దివాకర్‌రెడ్డి, కలెక్టరేట్ ఏవో హన్మంతరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment