![‘పది’](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10jgl82-180032_mr-1739214874-0.jpg.webp?itok=GGvEzNNA)
‘పది’లో పట్టు సాధించాలి
జగిత్యాల: పదో తరగతిలో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలని డీఈవో రాము అన్నారు. టీచర్స్ భవన్‌లో సోమవారం భౌతి క, రసాయనశాస్త్రంలో టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. జిల్లా నుంచి 54 మంది విద్యార్థులు పాల్గొన్నారు. టెస్ట్‌లో జగిత్యాల గురుకులం విద్యార్థి వర్షిణి ప్రథమ, జోగినిపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన అక్షయ ద్వితీయ, గోవిందారం ఉన్నత పాఠశాలకు చెందిన పవన్ మూడోస్థానం సాధించారు. వీరికి బహుమతులు అందించి అభినందించారు. కో–ఆర్డినేటర్ రాజేశ్, డీసీఈబీ సెక్రటరీ మురళీమోహనాచా రి, జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్, భౌతిక రసాయన శాస్త్రం ఫోరం అధ్యక్షుడు శ్రీనివా స్‌రావు, కార్యదర్శి చంద్రశేఖర్ పాల్గొన్నారు.
వ్యవసాయ కళాశాల తరలింపు సరికాదు
వెల్గటూర్: మండలంలోని కోటిలింగాలలో ప్రతిపాదించిన వ్యవసాయ కళాశాలను జగి త్యాలకు తరలించడం సమంజసం కాదని మా జీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. స్తంభంపల్లిలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో గోదావరి నది ఒడ్డున 40 ఎకరాల్లో నూతన విత్తన రకాలు, విత్తనాల అభివృద్ధికి అనువైన స్థలం ఉందని అప్పటి సీఎం కేసీఆర్‌ను ఒప్పించి వ్యవసాయ కళాశాలను మంజూరు చేయిస్తే దానిని జగిత్యాలకు ఎందుకు తరలిస్తున్నారో ఎమ్మెల్యే అడ్లూరి సమాధానం చెప్పాలన్నారు. కోటిలింగాల పునర్నిర్మాణం, రాజగోపురానికి రూ.2.5 కోట్లు మంజూరుచేస్తే ఇప్పటి వరకు అడుగు పడలేదన్నారు. రూ.5కోట్లతో అంబేడ్కర్ విజ్ఞాన్ భవన్, బౌద్ధస్తూపం ఏర్పాటు కు రూ.2కోట్లు మంజూరైనా పనులు ప్రారంభించలేదన్నారు. హరిత హోటల్‌ను ఇప్పటికీ ప్రారంభించలేదని తెలిపారు. తాను మంత్రి గా ఉన్న నాలుగున్నరేళ్లలో రూ.82 కోట్ల ఎల్‌వోసీలు అందించానని, 14 లిఫ్ట్ ఇరిగేషన్‌లు, లక్ష ఎకరాలకు సాగు నీరు, చిల్వాకోడూర్, స్తంభంపల్లి డబుల్ రోడ్డు, జగదేవుపేటకు రూ.3కోట్లతో వంతెన, రోడ్డు, రాజారాంపల్లి వద్ద వంతెన నిర్మించామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలైనా ఒక్క పని కూడా చేయలేదని తెలిపారు. వ్యవసాయ కళాశాల ప్రారంభించాలని, లేకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాంచందర్, వెంకటేశ్, కృష్ణారెడ్డి, కుమార్, రవి, సతీశ్, సత్యం, తిరుపతి, రాజయ్య, మనీష్ పాల్గొన్నారు.
![‘పది’లో పట్టు సాధించాలి1](https://www.sakshi.com/gallery_images/2025/02/11/10dmp101-180137_mr-1739214874-1.jpg)
‘పది’లో పట్టు సాధించాలి
Comments
Please login to add a commentAdd a comment