‘విశ్వకర్మ యోజన’ను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

‘విశ్వకర్మ యోజన’ను సద్వినియోగం చేసుకోవాలి

Published Mon, Dec 18 2023 1:04 AM | Last Updated on Mon, Dec 18 2023 1:04 AM

- - Sakshi

జనగామ రూరల్‌: ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బేజాడి బీరప్ప అన్నారు. ఆదివారం పట్టణంలోని 23, 24, 25 వార్డుల్లో అసెంబ్లీ కన్వీనర్‌ బల్లా శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పథకాన్ని ప్రారంభించి విధి విధానాలు వివరించారు. ఈ సందర్భంగా బీరప్ప మాట్లాడుతూ 18 రకాల చేతి వృత్తుల కులాల వారికి ప్రయోజన కరంగా ఉండడానికి రూ.13 వేల కోట్లతో పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. రూ. 3 లక్షలతో పథకంలో రుణాలు అందజే స్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరు ఉపయోగించుకోని ఆర్థిక స్వావలంబన సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి

జనగామ రూరల్‌: ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న పెన్షనర్స్‌ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఎర్రోజు రామస్వామి అన్నారు. ఆదివారం పెన్షనర్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని సంఘం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్‌బీఐ చీఫ్‌ మేనేజర్‌ రాజేష్‌ చంద్ర హాజరై జిల్లాలోని 18 మంది సీనియర్‌ పెన్ష్‌నర్స్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అంబటి రాజయ్య, కార్యదర్శి రామచంద్రం, కోశాధికారి సంపత్‌కుమార్‌, ఉపాధ్యక్షుడు మర్రి జనార్దన్‌ రెడ్డి, మహిళ ఉపాధ్యక్షురాలు గాదే కాధరిన్‌, లక్ష్మయ్య, భుజంగరెడ్డి, మంజుల, ఎస్‌. వెంకటయ్య, మాధవరెడ్డి, సరళ, ధనలక్ష్మి, ఉమామహేశ్వర్‌, సంజీవ రెడ్డి, గోపాల్‌రెడ్డి, ఎస్‌వీఎల్‌ఎన్‌ చారి, యాదగిరి, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

జఫర్‌గఢ్‌: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2024–25 విద్యా సంవత్సరానికి ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని స్థానిక గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సమత తెలిపారు. మండల కేంద్రంలో ఆదివారం విలేకర్లతో మాట్లాడుతూ 2024–25 విద్యా సంవత్సరానికి గాను ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సుల్లో ప్రవేశానికి ఇప్పటి నుంచే ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్‌, సీఎంఏ క్లాటు పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అర్చక ఉద్యోగులు అధైర్యపడొద్దు

పాలకుర్తి టౌన్‌: దేవాదాయ శాఖలో పని చేస్తున్న అర్చక, ఉద్యోగులు అదైర్యపడొద్దని త్వరలో సమస్యలు పరిష్కరించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని అర్చక, ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ డీవీఆర్‌శర్మ తెలిపారు. ఆదివారం ఏఐసీసీ జరరల్‌ సెక్రటరీ ఎంఏ సంపత్‌కుమార్‌ ఆధ్వర్యంలో అర్చక, ఉద్యోగుల హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి సమస్యలను విన్నపించుకున్నారు. ఈ సందర్భంగా డీవీఆర్‌శర్మ మా ట్లాడుతూ అర్చక ఉద్యోగులకు తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని సీఎం రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారన్నారు. కార్యక్రమంలో అర్చక ఉద్యోగ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంద్‌శర్మ, ఉపాధ్యక్షుడు తక్కర్ళు సత్యం, ఉద్యోగ సంఘం ప్రధాన కార్యదర్శి శ్యాంసుదర్‌గౌడ్‌, డీడీఎన్‌ఎస్‌ ఉపాధ్యక్షులు నరేందర్‌లతోపాటు అర్చక ఉద్యోగ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

2
2/2

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement