రక్తదానంతో మరొకరికి ప్రాణదానం | - | Sakshi
Sakshi News home page

రక్తదానంతో మరొకరికి ప్రాణదానం

Published Sat, Oct 26 2024 1:30 AM | Last Updated on Sat, Oct 26 2024 1:30 AM

రక్తదానంతో మరొకరికి ప్రాణదానం

రక్తదానంతో మరొకరికి ప్రాణదానం

జనగామ: మానవ జీవితంలో రక్తదానం చేసి, ఆపదలో ఉన్న వ్యక్తులకు ఊపిరిపోయాలని డీసీపీ రాజమహేంద్రనాయక్‌ అన్నారు. శుక్రవారం పోలీసు అమరవీరుల సంస్మరక వారోత్సవాలను పురస్కరించుకుని వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌, వెస్ట్‌ జోన్‌ పోలీసులు, జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ, జనగామ రక్తనిధి కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో జూబ్లీ పంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని డీసీపీ ప్రారంభించారు. అనంతరం ఏసీపీ పార్థసారధి అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీసీపీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఒకరి రక్తదానంతో ఐదుగురు అవసరార్థులకు ఉపయోగపడుతుందన్నారు. జనగామ రెడ్‌ క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ డాక్టర్‌ డి.లవకుమార్‌ రెడ్డి మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల అనేక లాభాలతో పాటు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారన్నారు. రెడ్‌ క్రాస్‌ ప్రతినిధి డాక్టర్‌ సీహెచ్‌ రాజమౌళి మాట్లాడుతూ రక్తదానం చేస్తే ఏమో అవుతుందనే అపోహలు వీడాలన్నారు. అంతకు ముందు డీసీపీ, నర్మెట సీఐ అబ్బయ్య, ఎస్సైలు రాజేష్‌, చెన్నకేశవులు, పోలీసు సిబ్బంది, యువకులు, లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు, ఆయా వర్గాల ప్రజలు రికార్డు స్థాయిలో 221 యూనిట్ల రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్‌ క్రాస్‌ కార్యదర్శి, లయన్‌న్స్‌ పూర్వ జిల్లా గవర్నర్‌ కన్నా పరశురాములు, జనగామ బ్లడ్‌ బ్యాంక్‌ వైద్యాధికారులు డాక్టర్‌ పి.కరుణాకర్‌ రాజు, ఎం.దివ్య ఎస్సైలు భరత్‌, శ్వేత, హమీద్‌, రెడ్‌ క్రాస్‌, కృష్ణ జీవన్‌ బజాజ్‌, శ్రీరాం శ్రీనివాస్‌, నర్సిరెడ్డి, వై.సంజీవరెడ్డి, డాక్టర్‌ డి.శివశంకర్‌ రావు, గాదె నర్సింహులు, లోకమంతారెడ్డి, జక్కుల వేణుమాధవ్‌, శ్రీనివాస్‌రెడ్డి, జేరిపోతుల కుమార్‌, బైరు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

డీసీపీ రాజమహేంద్ర నాయక్‌

పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement