అట్టహాసంగా ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ ప్రమాణ స్వీకారం | - | Sakshi
Sakshi News home page

అట్టహాసంగా ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ ప్రమాణ స్వీకారం

Published Mon, Oct 28 2024 1:26 AM | Last Updated on Mon, Oct 28 2024 1:26 AM

అట్టహ

అట్టహాసంగా ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ ప్రమాణ స్వీకారం

జనగామ: జనగామ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా జరిగింది. జనగామ మండలం షామీర్‌పేట ఉషోదయ కన్వెన్షన్‌ హాలులో మహంకాళి హరిశ్చంద్రగుప్త అధ్యక్షతన జరిగిన వేడుకల్లో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ వంగవీటి అశోక్‌ కుమార్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి చిత్రపటానికి పూల మాల వేసి పూజలు చేసిన అనంతరం ప్రార్థన గీతంతో వేడుకలను ప్రారంభించారు. జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు డాక్టర్‌ గంగిశెట్టి ప్రమోద్‌ కుమార్‌, ఉపాధ్యక్షులు కొత్తపల్లి రాజయ్య, కార్యదర్శి గన్ను నరసింహులు, కోశాధికారి బెజుగం భిక్షపతి, మహిళా సంఘం, సేవాదల్‌, యూత్‌ జిల్లా కార్యవర్గం, సిటీ యూత్‌ కార్యవర్గంతో కలుపుకుని మొత్తం 256 మందితో రాష్ట్ర అధ్యక్షుడు ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం అమరవాది లక్ష్మినారాయణతో పాటు అతిథుల చేతుల మీదుగా నూతన కార్యవర్గాన్ని సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోకల జమున లింగయ్య, పజ్జూరి గోపయ్య, పజ్జూరి జయహరి, మర్యాల అశోక్‌, జిల్లా రాజేశ్వర్‌, దొంతుల చంద్రమౌళి, కొత్తపల్లి కాశీపతి, కొత్తపల్లి రాజమౌళి, మహంకాళి శివకుమార్‌, సంతోష్‌, అనంతలక్ష్మి, రాణి, జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్షులు తదితరులు హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
అట్టహాసంగా ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ ప్రమాణ స్వీకారం1
1/1

అట్టహాసంగా ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ ప్రమాణ స్వీకారం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement