పోలీసు అమరుల త్యాగాలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

పోలీసు అమరుల త్యాగాలు చిరస్మరణీయం

Published Mon, Oct 28 2024 1:26 AM | Last Updated on Mon, Oct 28 2024 1:26 AM

పోలీసు అమరుల త్యాగాలు చిరస్మరణీయం

పోలీసు అమరుల త్యాగాలు చిరస్మరణీయం

స్టేషన్‌ఘన్‌పూర్‌: విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఏసీపీ భీమ్‌శర్మ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఘన్‌పూర్‌ సబ్‌డివిజన్‌ పోలీసుశాఖ వారి ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక మాగార్డెన్స్‌ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిఽథిగా ఏసీపీ హాజరై ప్రారంభించారు. రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో 102 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తం ఏ ఫ్యాక్టరీలోనూ తయారు కాదని, రక్తదానం చేయడమే మార్గమని, ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రుల ప్రాణాలు కాపాడేందుకు రక్తం ఆవశ్యకత ఎంతో ఉంటుందన్నారు. ఆరోగ్యవంతులైన ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలన్నారు. అనంతరం రక్తదానం చేసిన వారికి ఏసీపీ, సీఐల చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో సీఐలు జి.వేణు, ఎ.శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐలు వినయ్‌కుమార్‌, నవీన్‌కుమార్‌, పోలీసు సిబ్బంది, లయన్స్‌క్లబ్‌ బాధ్యులు, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement