రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
పాలకుర్తి టౌన్: రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం చైర్‌పర్సన్‌గా లావుడ్య మంజుల, వైస్ చైర్మన్‌గా అనుమల మల్లారెడ్డి, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి వ్యవసాయ మార్కెట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాంచంద్రునాయక్ మాట్లాడుతూ డిసెంబర్‌లో రైతు రు ణమాఫీకి సంబంధించి మరో రూ.13వేల కోట్లు వి డుదల చేస్తామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్ధేశ్యంతో బీఆర్‌ఎస్ నాయకులు లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తున్నారని వి మర్శించారు. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతూ రాష్టంలో పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్ర భుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో పాలకుర్తి ని యోజకవర్గ ఇన్‌చార్జ్ హనుమండ్ల ఝాన్సీరెడ్డి, ట్రై కార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, మాజీ ఎంపీ రవీంద్రనాయక్, డాక్టర్ లక్ష్మీనారాయణనాయక్, తొర్రూరు మార్కెట్ చైర్మన్ తిరుపతిరెడ్డి, రాపాక సత్యనారాయణ, గిరగాని కుమారస్వామి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
ఘనంగా పాలకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం
Comments
Please login to add a commentAdd a comment