హరహర మహాదేవ..
జనగామ: కార్తీక మాస పర్వదినం పురస్కరించుకుని చివరి సోమవారం జిల్లాలోని శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. తెల్లవారు జాము 4.30 గంటలకు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకంతో పూజా కార్యాక్రమాలను ప్రారంభించారు. అర్థరాత్రి వరకు అభిషేకాలు కొనసాగగా... కుంకుమ, అన్నపూజలు చేసిన భక్తులు చల్లంగా దీవించాలని వేడుకున్నారు. జిల్లాలోని పాలకుర్తి సోమేశ్వరాలయం, బచ్చన్నపేట మండలం కొడవటూరు సిద్ధేశ్వరాలయం, పట్టణంలోని రామలింగేశ్వర, గీతాశ్రమం, సంతోషిమాత, బతుకమ్మకుంట విజయదుర్గా, చీటకోడూరు పంచకోసు రామలింగేశ్వర, తదితర ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి.
కార్తీకమాసం చివరి సోమవారం
ఆలయాలకు పోటెత్తిన భక్తజనం
Comments
Please login to add a commentAdd a comment